భారీ వర్షాలపై కేసీఆర్‌ సర్కార్‌ కీలక ఆదేశాలు..ఇంట్లో నుంచి బయటకు రావొద్దు !

-

భారీ వర్షాలపై కేసీఆర్‌ సర్కార్‌ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఐఏఎస్‌ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితులను సమీక్షించారు.

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, పశువులు, ఆస్తినష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు.

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నీటిపారుదల, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇంధన శాఖలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి.ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని ట్యాంకులు, చెరువులు, రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రమాదకర ట్యాంకులకు తెగితే ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే ప్రత్యేక శిబిరాలకు తరలించాలి. రోడ్లకు ఏమైనా నష్టం జరిగితే వెంటనే మరమ్మతులు చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news