సీఎం కేసీఆర్‌ ప్రెస్‌ మీట్‌ పై విశ్వహిందూ పరిషత్ సీరియస్

-

సీఎం కేసీఆర్‌ ప్రెస్‌ మీట్‌ పై విశ్వహిందూ పరిషత్ సీరియస్ అయింది. దేవి, దేవతలను కించపరుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలను విశ్వహిందూ పరిషత్ తప్పుపడుతోందన్నారు విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి. ఇటీవల పెరేడ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. తెలంగాణలోని ప్రముఖ దేవతలందరినీ కీర్తించారు. అయితే ఆ వ్యాఖ్యలను రాజకీయ పరంగా తప్పుపడుతూ సీఎం కేసీఆర్ హిందూ దేవి దేవతలను కించపరిచేలా మాట్లాడటాన్ని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు.

ఆ వ్యంగమైన మాటలతో హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ” ఆ అంబా.. ఈ అంబా” అంటూ జోగులాంబను అవమానపరిచిన తీరు క్షమించడానిది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ 12-07-2022 న రాష్ట్రవ్యాప్తంగా బజరంగ్దళ్ ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్లో కేసులో నమోదు చేస్తున్నాము. ప్రస్తుతం సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫిర్యాదు చేస్తున్నాము. దయచేసి ఈ విషయాన్ని ప్రసారం, ప్రచురణ చేయగలరని మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి.

 

Read more RELATED
Recommended to you

Latest news