ఆరోగ్యశ్రీ కార్డుదారులకు జగన్ శుభవార్త.. ఆగస్టు ఒకటి నుంచి ఆ సేవలు ప్రారంభం

-

 

ఆరోగ్యశ్రీ కార్డుదారులకు ఏపీ సీఎం జగన్ శుభవార్త చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు.ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఆదేశించారు. ఆగస్టు 1 నుంచి పెంచిన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం….ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు.

విలేజ్‌ క్లినిక్స్‌కు, పీహెచ్‌సీలకు డిజిటల్‌ వీడియో అనుసంధానత ఉండాలి…పెంచనున్న చికిత్సల జాబితాను త్వరలోనే ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ కార్డుదారులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.  కాగా  ఇప్పటికే ఆరోగ్య శ్రీ ద్వారా 2446 చికిత్సలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న ప్రభుత్వం….ఆరోగ్యశ్రీ కింద డబ్బు నేరుగా రోగి వర్చువల్‌ బ్యాంకు ఖాతాలోకి… అక్కడ నుంచి ఆస్పత్రికి చెల్లింపులు చేస్తుంది. ఆస్పత్రిలో చేరిన రోగి నుంచి ముందుగా కన్సెంట్‌ ఫాం, చికిత్స పూరై్తన తర్వాత ధృవీకరణ పత్రం ఇస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news