జగన్ అంటే ప్రజలకు కంపరం పుట్టింది – చంద్రబాబు

-

జగన్ అంటే ప్రజలకు కంపరం పుట్టింది.. అందుకే సర్వేలో 20 స్థానంలోకి వెళ్లారని చురకలు అంటించారు చంద్రబాబు. దేశం వ్యాప్తంగా సర్వే చేస్తే టీడీపీ వాళ్లు చేయించారని అంటారా..? వైసీపీకి వ్యతిరేకంగా ఏం వచ్చినా వాళ్లంతా టీడీపీ వాళ్లు చేయించినట్టేనా..? అని నిలదీశారు. వైసీపీ గ్రాఫ్ పడిపోయిందని వేరేవరో చెప్పడం దేనికీ.. వాళ్లకే రిపోర్టులు వచ్చాయి… గడప గడపకు ఎత్తిపోయింది నిజం కాదా..? అని నిలదీశారు.

అటవీ, మైనింగ్, రెవెన్యూ యంత్రాంగాలు సమాధానం చెప్పాలి… సమాజానికి చెడు చేసే వ్యక్తులతో నా పోరాటమన్నారు. క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల నిర్మాణంపై జోనల్ ఇన్‌ఛార్జ్‌లతో బుధవారం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌ నియామకాలు కాని 30 నియోజకవర్గాలపై దృష్టి సారించి, వారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో క్లస్టర్, యూనిట్ నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు చంద్రబాబు.

అదేవిధంగా బూత్ కమిటీల నియామకం ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు చంద్రబాబు. ఆగస్టు మొదటి వారం నుంచి 15వ తేదీలోపు సెక్షన్ల నియామకం పూర్తి చేయాల్సిందేనని, ఇందుకోసం జోనల్ ఇన్‌ఛార్జ్‌లు సంబంధిత జోనల్ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని.. నిర్దేశిత సమయంలోపు కమిటీల నిర్మాణం పూర్తి చేయాలన్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news