49 ఓవ‌ర్ల‌లోనే ఇంగ్లండ్ ఆలౌట్‌.. చెలరేగిన చాహల్‌

-

ఇంగ్లండ్ టూర్‌లో స‌త్తా చాటుతున్న టీమిండియా జట్టు వ‌న్డే సిరీస్‌లో భాగంగా గురువారం జ‌రుగుతున్న రెండో వన్డేలోనూ రాణించింది. తొలి వ‌న్డేలో ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా చుక్కలు చూపించగా… రెండో వ‌న్డేలో స్పిన్న‌ర్ య‌జువేంద్ర చాహ‌ల్ బంతితో చెలరేగాడు. చాహ‌ల్‌కు బుమ్రా, హార్దిక్ ప్యాండ్యా జ‌త క‌ల‌వడంతో పూర్తిగా 50 ఓవ‌ర్లు ఆడ‌కుండానే ఆతిథ్య జ‌ట్టు చేతులెత్తేసింది. అయితే తొలి రోజు స‌గం ఓవ‌ర్ల‌కే ఆలౌట్ అయిన ఇంగ్లండ్ జ‌ట్టు రెండో వ‌న్డేలో మాత్రం 49 ఒవ‌ర్ల వ‌ర‌కు బ్యాటింగ్ చేయ‌గ‌లిగింది. 39 ఓవ‌ర్ల‌లో ఇంగ్లండ్ జ‌ట్టు 246 ప‌రుగులు చేసింది. మ‌రికొసేప‌ట్లో 247 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో టీమిండియా త‌న ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌నుంది.

India vs England 2nd ODI Live Score: Yuzvendra Chahal takes four as IND  dismiss ENG for 246 | Hindustan Times

టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బౌలింగ్ ఎంచుకోగా… చాహ‌ల్‌, పాండ్యా త‌మ‌దైన శైలి బౌలింగ్‌తో మ్యాజిక్ చేశారు. చాహ‌ల్ పూర్తిగా 10 ఓవ‌ర్ల పాటు బౌలింగ్ చేసి 47 ప‌రుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అదే స‌మ‌యంలో 6 ఓవ‌ర్లు మాత్ర‌మే వేసిన పాండ్యా 28 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్ల‌ను నేల‌కూల్చాడు. తొలుత వికెట్లు తీయ‌డానికి క‌ష్ట‌ప‌డ్డ బుమ్రా… చివ‌ర్లో 2 వికెట్లు తీశాడు. బుమ్రా మొత్తం 10 ఓవ‌ర్ల పాటు బౌలింగ్ చేసి ఓ మిడైన్ ఓవ‌ర్‌తో పాటు 2 వికెట్లు తీసి 49 ప‌రుగులు ఇచ్చాడు. ఇక మ‌హ్మ‌ద్ ష‌మీ, ప్ర‌సిద్ధ కృష్ణ‌లు చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news