సాధారణం కంటే 450 శాతం ఎక్కువ గా వర్ష పాతం : కేటీఆర్‌

-

తెలంగాణలో గత ఐదు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టారు. అయితే తాజాగా మంత్రి కేటీఆర్‌ భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా జులైలో అత్యధిక వర్షం నమోదు అయ్యిందని, ప్రాథమిక సమాచారం ప్రకారం సాధారణం కంటే 450 శాతం ఎక్కువ గా వర్ష పాతం నమోదైందని ఆయన వెల్లడించారు. జిల్లాలో పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్ మాదిరి అసాధారణ పరిస్థితులు లేవని, అయినా ఉదాసీనంగా, ఆలక్ష్యంగా ఉండొద్దన్నారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆయన తెలిపారు. ఆస్తి నష్టం కనిష్టానికి తగ్గించేలా చూడాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్ అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు ప్రో ఆక్టివ్ గా ఉండాలని, చెరువులు డ్యామ్లనుంచి నీటిని కిందికి విడుదల చేసే ముందు ప్రజలకి, పోలీస్ రెవెన్యూ వంటి ఇతర శాఖలో ఉద్యోగులకు సమాచారం ఇవ్వాలన్నారు.

KTR coins 'Bakwaas Jhumla Party' (BJP) on Twitter

నీటి విడుదల సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, జిల్లాలో ఒక్క ప్రాణ నష్టం ఉండొద్దన్నారు. ప్రాఫర్ గా మున్సిపాలిటీలతో సహా అన్ని గ్రామాలలో సేఫ్టీ అడిట్ జరగాలన్నారు. పట్టణాలు గ్రామాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. తాగునీరు కాలుష్యం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామాల్లో పారిశుధ్యం పైన ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు కఠినంగా వ్యవహరించాలని, శిథిలావస్థలో ఉన్న పాత నిర్మాణాలను వెంటనే తొలగించాలి. నిరుపయోగంగా ఉన్న బోరుబావులతో పాటు నీటి బాగులను వెంటనే పూడ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. నిర్మాణ పనులు జరిగే చోట హెచ్చరిక సంకేతాలు పెట్టాలి. బ్యారికెడ్ ల నిర్మాణం చేపట్టాలన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news