విద్యార్థులకు శుభవార్త..ఐటీఐలో కొత్త కోర్సులు.. ఏంటంటే?

-

ఐటిఐ చేస్తే మంచి భవిష్యత్తు తో పాటు ఉపాధి లభిస్తుంది, సాంకేతిక పరిజ్ఞానం దృష్టిలో పెట్టుకోని సంగారెడ్డి జిల్లా కు కోత్తగా మరో రెండు ట్రేడ్స్ వచ్చాయి..అన్నీ రకాలుగా విద్యార్థులకు మంచి అవకాశాలు కల్పించాలని అధికారులు భావిస్తున్నారు..ఉపాధి, ఉద్యోగావకాశాలకు మార్గం సుగమం అవుతుంది. ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం పారిశ్రామిక శిక్షణ సంస్థ లను ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో స్వయం ఉపాధిలోనూ రాణించేలా కొత్త ట్రేడ్ పై సాంకేతిక విద్యా శాఖ దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐకి రెండు కొత్తట్రేడ్లను మంజూరు చేసిన నేపథ్యంలో పాత జిల్లాల ప్రాతిపదికన జిల్లాలో నాలుగు ప్రభుత్వఐటీఐలు ఉన్నాయి.

ఈ మేరకు సంగారెడ్డి, హత్నూర, పటాన్చెరులో నిర్వహిస్తున్నారు. వీటితో పాటు మరో 15 ప్రైవేటు ఐటీఐలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు వాటితో కలిపి మొత్తం 5,470 మంది విద్యార్థులు ఉన్నారు. పాత జిల్లాల ప్రాతిపదికన అన్ని సదుపాయాలు ఉన్న ఐటీ కొత్త ట్రేడ్లను ప్రవేశపెట్టాలని విద్యాసాఖ అధికారులు నిర్ణయించారు.. అయితే పాత నోటిఫికేషన్ ప్రకారం కొన్ని పూర్తీ చేయనున్నారు.

ఫ్యాషన్డిజైన్ టెక్నాలజీ, మెకానిక్ మోటార్ వెహికిల్ ట్రేడ్లను ప్రారంభించేందుకు ఇప్పటికే అనుమతులు వచ్చాయి. కాగా ప్రవేశాలపై మార్గదర్శకాలు అందాల్సి ఉంది. ఇప్పటికే పాత కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొత్త కోర్సులకు రెండో విడత ప్రవేశాల సమయం నుంచి దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ కోర్సులు అయిన వెంటనే ఉపాధి కూడా కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులో చేరేందుకు విద్యార్థినులకు మాత్రమే అవకాశం కల్పించనున్అందరు కొర్సులొ కొత్తగా రెండు ట్రేడ్లను సాంకేతిక విద్యాశాఖమంజూరు చేసింది. ఈ ట్రేడుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణకు అనుతులు రావాల్సి ఉంది. అనుమతులు రాగానే మీసేవ ద్వారా అన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..ఇందులో కోర్సులు పూర్తి అయిన వెంటనే మంచి జీతంతో ఉద్యోగాలు ఉంటాయని, అందరు ఈ కోర్సులు చేస్తే బెస్ట్ అని అధికారులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news