దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన రాష్ట్రపతి ఎన్నికలు నిన్న ముగిశాయి. రాష్ట్రపతి ఎన్నికకు నిన్న ఉదయం 10 గంటలకు నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరిగింది. అయితే.. దేశవ్యాప్తంగా 98 శాతంపైగా పోలింగ్ నమోదైంది. అయితే ఈ తంతు ఇక్కడితో ముగియలేదు. ఇంకా ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగాల్సి ఉంది. అధికార ఎన్డీయే కూటమి తరఫున పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధనకర్ ఈ పదవి రేసులో ఉన్నారు. విపక్షాల తరఫున రాజస్థాన్ మాజీ గవర్నర్ మార్గరెట్ ఆళ్వా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె నేడు నాడు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఈ సమయంలో ఆమెతోపాటు పలువురు విపక్ష నేతలు కూడా హాజరవుతారని తెలుస్తోంది. మొత్తం 17 విపక్ష పార్టీలు కలిసి ఉపరాష్ట్రపతి పదవికి మార్గరెట్ ఆళ్వా పేరును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 6వ తేదీన ఈ ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఇదిలా ఉంటే.. ఈ నెల 21న రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ జరుగనుంది. జులై 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ పదవీకాలం ముగియనుంది.