తెలంగాణకు మరో మూడు రోజులు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. . నిన్న తూర్పు విదర్భ & పరిసర ప్రాంతంలో ఉన్న అల్పపీడనం ఈ రోజు తూర్పు విదర్భ & పరిసర ప్రాంతంలో కొనసాగుతూ ఉంది. ఈ అల్పపీడనంకి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లే కొలది నైరుతిదిశ వైపుగా వంపు తిరిగి ఉంది.
దీని ప్రభావంగా తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు *చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది.రేపు మరియు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షములు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు తెలంగాణలో అక్క డక్కడ వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.