అరుదైన చిత్రం : మొదటి భార్య లక్ష్మితో నాగార్జున..!!

-

అక్కినేని నాగేశ్వరరావు.. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు ఇద్దరూ కూడా సినీ ఇండస్ట్రీలో మంచి సన్నిహితులుగా ఉండేవారు. ఇక వీరిద్దరూ తమ స్నేహ బంధాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని ఆలోచనతో అక్కినేని నాగేశ్వరరావు వారసుడైనటువంటి నాగార్జునకి దగ్గుబాటి రామానాయుడు వారసురాలు దగ్గుబాటి లక్ష్మిని ఇచ్చి వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు. ఇక అదే సమయానికి తెలుగు చిత్ర పరిశ్రమ లోకి నటవారసుడిగా విక్రమ్ సినిమా తో అక్కినేని నాగార్జున ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక తన నటనతో ప్రేక్షకుల మనసుల్లో మన్మధుడిగా నిలిచిపోయిన ఈయన ఎన్నో చిత్రాలలో నటించి కింగ్ నాగార్జున గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇకపోతే ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే రామానాయుడు కూతుర్ని నాగార్జునకు ఇచ్చి వివాహం చేశారు.

అయితే వీరిద్దరికీ నాగచైతన్య జన్మించిన తర్వాత కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల ఇద్దరూ విడిపోయారు. ఆ రోజు నుంచి నేటి వరకు వీరికి సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో లేకపోవడం గమనార్హం. దగ్గుబాటి లక్ష్మీ కి సంబంధించిన ఫోటోలు అయితే మనం బయట విడివిడిగా చూడవచ్చు. కానీ తన భర్త నాగార్జునతో కలిసి దిగిన ఫోటోలను ఇప్పటివరకు ఎవరు చూడలేదని చెప్పాలి . ఇక తాజాగా ఇటీవల నాగార్జున – లక్ష్మి దంపతులకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది.ఇక ఈ ఫోటోలో నాగార్జున గుర్తు పట్టలేని విధంగా ఉన్నాడు. ఇకపోతే తమ అభిమాన హీరో అప్పట్లో ఇలా ఉన్నాడా అంటూ ఇటీవల యువత ఆ ఫోటోని బాగా వైరల్ చేస్తూ ఉండడం గమనార్హం.

ఇక లక్ష్మితో విడాకులు తీసుకున్న తర్వాత నాగార్జున అమల ను వివాహం చేసుకోవడం.. వారికి అఖిల్ పుట్టడం జరిగింది. ఇప్పుడు అమలతోనే నాగార్జున ఉంటున్నాడు. ఇక నాగార్జున సినిమాల విషయానికి వస్తే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకవైపు బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర తో పాటు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఘోస్ట్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇక ఇటీవలే తన కొడుకు నాగచైతన్యతో కలిసి బంగార్రాజు సినిమాను తెరకెక్కించగా ..ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు తండ్రీ కొడుకులు.

Read more RELATED
Recommended to you

Latest news