కేసీఆర్, మెగా కృష్ణారెడ్డి ఇద్దరూ తోడు దొంగలే : షర్మిల ఆగ్రహం

-

కేసీఆర్, మెగా కృష్ణారెడ్డి ఇద్దరూ తోడు దొంగలేనని వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా కృష్ణారెడ్డి రూ.70వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని, నల్లధనం ఉందని.. ఇందుకు సంబంధించి రూ.12వేల కోట్ల GST కట్టాల్సి ఉంటుందని స్వయంగా GST ఇంటెలిజెన్స్ చెబుతున్నా KCR ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.

మీ ఇద్దరు తోడు దొంగలనా? రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చేపట్టినా మెగా కృష్ణారెడ్డికే ఎందుకు ఇస్తున్నారు? మా తెలంగాణ వాళ్ళకి కాంట్రాక్ట్ పనులు చేయడం రాదా? లేక ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని దోచుకోవచ్చనా? అని ప్రశ్నించారు.

ఈ విషయంపై బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు? మెగా కృష్ణారెడ్డి మీకు కూడా దోస్తు కాబట్టి, మీకు ముడుపులు అందుతున్నాయి కాబట్టి మాట్లాడటం లేదా ? అని ఫైర్‌ అయ్యారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసే మీడియాకు కూడా కాళేశ్వరంలోకి అనుమతి ఇవ్వరా? ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. కాళేశ్వరం ఒక బోగస్ ప్రాజెక్టు. కేసీఆర్, మెగా కృష్ణారెడ్డి లబ్ధి పొందేందుకే ఈ ప్రాజెక్ట్ కట్టారు. ఒక్క వానకే నాణ్యత నవ్వులపాలైంది.. వేల కోట్ల ప్రజాధనం నీటిపాలైందని విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news