RC15లో అవకాశం అంటూ యాడ్స్.. అవన్నీ ఫేక్ అని తేల్చేసిన SVC బ్యానర్

RC15 సినిమాలో నటీనటులు మీరే అంటూ.. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు కొంతమంది వల వేస్తున్నార. ఈ మధ్యకాలంలో చక్కర్లు కొడుతోన్న ఇలాంటి ప్రచారాలతో తమకెలాంటి సంబంధం లేదని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ క్లారిటీ ఇచ్చింది. రామ్‌చరణ్‌ తదుపరి సినిమాలో నటీనటుల ఎంపికపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ ట్విటర్​లో ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న రామ్‌చరణ్‌ 15వ ప్రాజెక్ట్‌ కోసం నటీనటుల ఎంపిక జరుగుతోందంటూ సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారానికి మాకెలాంటి సంబంధం లేదు. అదంతా అబద్ధం. మా ప్రాజెక్ట్‌లో ఎవరినైనా నటీనటులుగా ఎంపిక చేసే బాధ్యత, అధికారం ఏ వ్యక్తికి, సంస్థకు లేదు. ఈ విషయంపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి’’ అని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది.

A note of caution to everyone #RC15 #SVC50 pic.twitter.com/KRPiykeCk2
— Sri Venkateswara Creations (@SVC_official) July 24, 2022

(RRR) తర్వాత శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కియారా అడ్వాణీ చెర్రీ సరసన నటించనుంది. పవర్‌ఫుల్‌ కథాంశంతో సోషియో ఫాంటసీ, పొలిటికల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సిద్ధం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news