కామన్వెల్త్‌తో అమ్మాయి క్రికెట్‌ షురూ.. తొలి మ్యాచ్‌లో టీమిండియా 154 పరుగులు

-

కామన్వెల్త్‌ గేమ్స్‌ అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే.. బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో ఈసారి మహిళల క్రికెట్ కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్ లో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఇక్కడి ఎడ్జ్ బాస్టన్ మైదానంలో టాస్ గెలిచిన టీమిండియా అమ్మాయిల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (34 బంతుల్లో 52 పరుగులు; 8 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడి అర్ధసెంచరీ నమోదు చేసుకోగా, ఓపెనర్ షెఫాలీ వర్మ 33 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధన 17 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు చేసింది.

India vs Australia Live Score Commonwealth Games 2022: Onus on Shafali  Verma as Smriti Mandhana departs for IND-W | Hindustan Times

ఆసీస్ బౌలర్లలో జొనాస్సెన్ 4 వికెట్లు తీయగా, షట్ 2, డార్సీ బ్రౌన్ 1 వికెట్ తీశారు. అనంతరం, 155 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ జట్టు టీమిండియా బౌలర్ రేణుకా సింగ్ ధాటికి 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ అలీసా హీలీ (0) డకౌట్ కాగా, మరో ఓపెనర్ బెత్ మూనీ (10), కెప్టెన్ మెగ్ లానింగ్ (8) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఈ మూడు వికెట్లు రేణుకా సింగ్ ఖాతాలోకే చేరాయి. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 3 ఓవర్లలో 3 వికెట్లకు 21 పరుగులు. క్రీజులో తహ్లియా మెక్ గ్రాత్, రాచెల్ హేన్స్ ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news