రేపే జగన్ తొలి కేబినేట్ మీటింగ్.. ప్రధాన అజెండా ఏంటంటే?

-

ఎన్నికల ప్రచార సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ఇచ్చిన హామీ మేరకు 27 శాతం ఐఆర్ ఇవ్వడానికి జగన్ సిద్ధంగా ఉండటంతో దీనిపై కూడా మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది. ఉద్యోగులకు ఐఆర్ పెంచడం వల్ల ప్రభుత్వ ఖజానాపై 2415 కోట్ల అదనపు భారం పడనుంది.

ఏపీ మంత్రి వర్గం కూడా కొలువు దీరింది. ఇక పూర్తి స్థాయిలో ఏపీ ప్రభుత్వం పని చేయనుంది. కొత్తగా ఎన్నికైన 25 మంది మంత్రులతో సీఎం జగన్ తొలి కేబినేట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. అయితే.. జగన్ ముందుగా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల హామీలను మంత్రుల దృష్టికి సీఎం తీసుకెళ్లనున్నట్లు సమాచారం. ప్రధానంగా రేపటి కేబినేట్ బేటీలో ఎనిమిది అంశాలపై చర్చ జరగనుందట. రేపు ఉదయం 10.30 కు సచివాలయం ఫస్ట్ బ్లాక్ లోని కాన్ఫరెన్స్ హాలులో భేటీ ఉంటుంది.

రైతులు, మహిళలు, ఉద్యోగులకు సంబంధించిన అంశాలే ప్రధాన అజెండాగా ఉంటాయట. ఖరీఫ్ లో రైతుల కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, ఆశావర్కర్లు వేతనాల పెంపు, ఉద్యోగులకు ఐఆర్ లాంటి నిర్ణయాలపై కేబినేట్ భేటిలో మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తిత్లీ తుఫాను, ఫొని తుపాను వల్ల కలిగిన నష్టంపై, కేంద్ర సాయంపై, బాధితుల పరిహారంపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు.

త్వరలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని సీఎం భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రులతో సీఎం జగన్ రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువుల లభ్యత, పంటకు మద్దతు ధర లాంటి అంశాలపై చర్చించనున్నారు.

మరోవైపు ఆశావర్కర్ల జీతాలను కూడా 3 వేల నుంచి 10 వేల వరకు పెంచుతూ జగన్ తొలి సంతకం పెట్టిన సంగతి తెలిసిందే. ఆ ఫైల్ ను మంత్రి మండలి ఆమోదించనుంది. దాదాపు 42 వేల మంది ఆశా వర్కర్లు ఈ నిర్ణయం వల్ల లబ్ధి పొందనున్నారు.

ఎన్నికల ప్రచార సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ఇచ్చిన హామీ మేరకు 27 శాతం ఐఆర్ ఇవ్వడానికి జగన్ సిద్ధంగా ఉండటంతో దీనిపై కూడా మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది. ఉద్యోగులకు ఐఆర్ పెంచడం వల్ల ప్రభుత్వ ఖజానాపై 2415 కోట్ల అదనపు భారం పడనుంది. అంతే కాదు.. సీపీఎస్ రద్దుపై కూడా ప్రభుత్వం రేపటి భేటీలో చర్చించనుంది.

ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలు రేపటి భేటీలో చర్చకు రానున్నాయి. హోంగార్డులకు కూడా జగన్ గుడ్ న్యూస్ చెప్పనున్నారు. వాళ్లకు కూడా వేతనాలు పెంచే అవకాశం ఉంది. అందుకే రేపటి తొలి కేబినేట్ భేటీకి అంత ప్రాధ్యానత. చూద్దాం.. రేపటి భేటిలో ఏపీ కేబినేట్ ఏం నిర్ణయాలు తీసుకుంటుందో?

Read more RELATED
Recommended to you

Latest news