బిజినెస్ చెయ్యాలి అనుకుంటున్నారా? అది కూడా ఇంట్లోనే కూర్చుని డబ్బులు సంపాదించాలి అనుకోనేవారికి మంచి బిజినెస్ ఐడియా ఉంది.ఈ వ్యాపారాన్ని పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేకపోవడం విశేషం. ఇంకా ఇంటి నుంచే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఉల్లి ధరలు విపరీతంగా పెరియాన్న వార్తలు మనం ప్రతీ ఏడాది వింటూనే ఉంటాం..ఇప్పుడు ధరలు భారీగా పెరగడంతో వంటలలో అరుదుగా కనిపిస్తున్నాయి..అటువంటి పరిస్థితితుల్లో ఉల్లి పేస్ట్ కోసం డిమాండ్ అధికమవుతుంది. మీరు కూడా ఈ అవకాశాన్ని క్యాచ్ చేయాలని భావిస్తే ఉల్లి పేస్ట్ వ్యాపారాన్ని ఎంచుకోవచ్చు..
అయితే,మొదట ఈ వ్యాపారం చెయ్యడానికి మీతో డబ్బులు లేకుంటే ప్రభుత్వ ముద్ర పథకం నుండి రుణం తీసుకోవచ్చు. కెవిఐసి నివేదిక ప్రకారం ఉల్లి పేస్ట్ తయారీ యూనిట్ ఏర్పాటుకు అయ్యే మొత్తం ఖర్చు రూ.4,19,000.ఇందులో బిల్డింగ్ షెడ్ నిర్మాణానికి రూ.లక్ష, పరికరాలు కోసం రూ.1.75 లక్షలు ఖర్చు అవుతుంది.ఇవి కాక,వ్యాపారాన్ని నడపడానికి రూ.2.75 అవసరం. ఈ యూనిట్ ద్వారా ఏడాదిలో దాదాపు 193 క్వింటాళ్ల ఉల్లి పేస్ట్ ను ఉత్పత్తి చేయవచ్చు. క్వింటాల్కు రూ.3,000 చొప్పున, దాని విలువ రూ.5.79 లక్షలు అవుతుంది.
ఉల్లిపాయ పేస్ట్ ఉత్పత్తి అయిన తర్వాత, దానిని బెస్ట్ ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది. విక్రయానికి మీరు మార్కెటింగ్ పర్సన్స్ సహాయం తీసుకోవచ్చు.ఇందుకోసం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే బిజినెస్ ఇంకా డెవలప్ అవుతుంది.వెబ్‌సైట్‌ను సృష్టించడం ద్వారా కూడా మీ ఉత్పత్తిని ప్రమోట్ చేయవచ్చు. మీకు రెండో ఏడాదిని నుంచి మంచి మొత్తంలో డబ్బులు మిగులుతాయి. బిజినెస్ బాగా డెవలప్ అయితే ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది..మీకు ఈ బిజినెస్ చేసే ఆలోచన ఉంటే మీరు కూడా స్టార్ట్ చెయ్యండి..