అప్పుల భాద నుంచి బయట పడాలంటే ఆదివారం ఇలా చెయ్యాల్సిందే..!!

-

మనం ఎంతగా డబ్బులు సంపాదిస్తున్నా కూడా చేతిలో ఉండటం లేదని, వృధా ఖర్చులు ఎక్కువ అవ్వడంతో అప్పులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయని చాలా మంది భాధ పడుతూ ఉంటారు.కొన్నిసార్లు ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతాడు. వ్యాపారం, ఆర్థిక సమస్యలతో చుట్టుముడుతుంటాయి. జీవితంలో ప్రతికూలత పెరిగి నిరుత్సాహానికి గురవుతారు. సంతోషకరమైన జీవితం కోసం మనం రోజూ ఎలాంటి పనులు చేయాలో తెలుసుకుందాం..

*. ఎల్లప్పుడూ ఇంటి ఈశాన్య దిశలో ఏదైనా పవిత్ర నది నుండి తీసుకువచ్చిన నీటిని ఉంచండి. ఇది మీ ఇంటికి చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

*. ఆర్థిక సమస్యలు తొలగాలంటే ఆదివారం పుష్య నక్షత్రం నాడు అంజూరపు చెట్టు వేరును ఇంటికి తీసుకొచ్చి ధూప దీపం పెట్టండి. ఆ తర్వాత సురక్షితమైన స్థలంలో ఉంచండి. ఇది మీ జీవితంలో ఆనందం శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు.

*. ఉదయం పూట ముఖం కడుక్కోకుండా ఆహారం లేదా పానీయాలు తినకూడదు. అలాగే, స్నానం చేయకుండా లేదా మురికి చేతులతో మతపరమైన పుస్తకాలు, దేవుని విగ్రహాలను తాకడం అశుభం. ఇలా చేయడం వల్ల ఇంట్లోని వ్యక్తుల సంపద , గౌరవంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నమ్ముతారు.

*. ఇంట్లో దేవుడికి సమర్పించే పువ్వులు లేదా దండలు వాడిపోగానే, వాటిని తీసివేసి, పారే నీటిలో వేయండి. కానీ చాలామంది ఇళ్లలో దేవుళ్లకు వేసిన పూలదండలు వాడిపోగానే తీసి బయట పడేస్తుంటారు. ఇలా చేయడం పొరపాటు..

*. తినేటప్పుడు, మీ ముఖం ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి. అలాగే, జీవితంలో చెడు ప్రభావాలను నివారించడానికి, బూట్లు ధరించి ఆహారం తినవద్దు. వీలైతే, వంటగదిలో కూర్చొని ఆహారం తినండి.

*. జీవితంలో సంతోషాన్ని, అదృష్టాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఇంట్లోని దేవుని గదిలో దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించండి..ఇలా చేస్తే అన్నీ దోషాలు పూర్తిగా తొలగి పోతాయి..అప్పుడు ఇంట్లో చికాకులు కూడా తొలగిపోయి సుఖ, సంతోషాలు వెల్లువిరుస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news