ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడానికి మూవీ మేకర్స్ ఎప్పుడూ డిఫరెంట్ గా ప్రయత్నాలు చేస్తుంటారు. ఎవరూ ఊహించని విధంగా సినిమాలు చేయాలని ప్రయత్నిస్తుంటారు. ఇక ప్రమోషన్స్ లో అయితే రకరకాల పద్ధతులను ఫాలో అవుతుంటారు. టైటిల్ దగ్గర నుంచి మొదలుకుని మ్యూజిక్ వరకు అన్ని అంశాలు జనాలను ఆకట్టుకోవాలని అనుకుంటారు.
అలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనుకున్న మేకర్స్.. ఈ సినిమాలకు టైటిల్స్ వెరీ డిఫరెంట్ గా పెట్టేశారు. ఆ సినిమాల్లో కొన్ని మూవీస్ టైటిల్స్ గురించి చర్చించుకుందాం. ఈ పిక్చర్స్ టైటిల్ జనాలకు విపరీతంగా నచ్చేయడమే కాదు..ఈ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి కూడా.. ఆ సినిమాలు..‘అన్నవరం’, ‘అరుణాచలం’, ‘భద్రాచలం’, ‘కేరాఫ్ కంచెరపాలెం’, ‘బొంబాయి’, ‘భీమిలి’, ‘హనుమాన్ జంక్షన్’, ‘గంగోత్రి’. ఈ చిత్రాల టైటిల్స్ చూడగానే ఆ ప్రాంతం లేదా ఆ ఊరి సమీపం వాళ్లకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘అరుణాచలం’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. తమిళనాడులోని ఓ ప్రాంతం పేరు ‘అరుణాచలం’ కాగా అదే పేరును సినిమాకు పెట్టారు మేకర్స్. ఇక ‘హనుమాన్ జంక్షన్’ పిక్చర్ విషయానికొస్తే డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ మూవీ..పేరు ఏపీలోని ఏలూరు దగ్గర ఉన్న ఓ జంక్షన్ పేరు. ‘హనుమాన్ జంక్షన్’ అక్కడ బాగా ఫేమస్. ఆ పేరును సినిమాకు పెట్టుకున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి చిత్రం ‘గంగోత్రి’..పుణ్యక్షేత్రం పేరు మీదుగా పెట్టినట్లున్నారు మేకర్స్. గంగోత్రి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ పిక్చర్ సూపర్ హిట్ అయింది. ఇక కంచెరపాలెం అనే ఊరిలో మనుషుల మధ్య జరిగిన కథను చెప్పిన క్రమంలో ‘కేరాఫ్ కంచెరపాలెం’ అనే సినిమా టైటిల్ వచ్చింది.
నేచురల్ స్టార్ నాని నటించిన ‘భీమిలి’..చిత్రం కబడ్డీ నేపథ్యంలో వచ్చింది. ఈ చిత్రంలో ఆ ఊరి జట్టు సభ్యుడిగా నాని కనిపిస్తారు. అలా ఈ చిత్రానికి ‘భీమిలి’ టైటిల్ వచ్చింది. మణిరత్నం దర్శకత్వంతో వచ్చిన ‘బొంబాయి’ మూవీ.. ఆ నగరంలో జరిగిన అల్లర్లు, మత ఘర్షణల ఆధారంగా తెరకెక్కించినది. అలా ఈ మూవీకి ఆ పేరు వచ్చింది.