వివేకా హత్య కేసు.. ఆ ముగ్గురికి నో బెయిల్‌

-

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు ఎదురుదెబ్బ తగిలింది. ఏ2, ఏ3, ఏ5 నిందితులుగా ఉన్న సునీల్‌ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. వారికి బెయిల్‌ ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది.

అనారోగ్య కారణాల రీత్యా తమకు బెయిల్‌ మంజూరు చేయాలని ఈ ముగ్గురూ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారంతా కడప కేంద్ర కారాగారంలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news