నేడు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ ఇంటి పార్టీ విలీనం

-

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. అధికార పార్టీ నుంచి విపక్ష పార్టీల్లోకి, విపక్ష పార్టీల్లోంచి.. అధికార పార్టీలోకి నేతలు జంప్‌ అవుతున్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడే వాలిపోతున్నారు. ఎర్రబెల్లి తమ్ముడు, కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డిల ఎపిసోడ్‌ మురువక ముందే.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది.

నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు ఉద్యమకారులు చెరుకు సుధాకర్. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో తన తెలంగాణ ఇంటి పార్టీని విలీనం చేయనున్నారు ఉద్యమకారులు చెరుకు సుధాకర్. కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో కాస్త డీలా పడ్డ కాంగ్రెస్‌ పార్టీకి.. కాంగ్రెస్ పార్టీలో తన తెలంగాణ ఇంటి పార్టీ విలీనం కాస్త ఊరట కలిగించే అంశం. రేవంత్‌ రెడ్డి పనితీరు, టీఆర్‌ఎస్‌ కు కాంగ్రెస్‌ పార్టీనే ప్రత్యామ్నాయం అనే రెండు అంశాలను బేరీజు వేసుకున్న చెరుకు సుధాకర్… కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇవాళ ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news