శోభిత దూళిపాళతో రిలేషన్ షిప్‌పై నాగచైతన్య కామెంట్స్ ఇవే..!

-

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, సమంత డైవోర్స్ తీసుకున్న సంగతి అందరికీ విదితమే. వారిరువురు తమ ప్రొఫెషనల్ లైఫ్ పైన ఫుల్ ఫోకస్ పెట్టి మూవ్ ఆన్ అయిపోయారు. కాగా, ఇటీవల సమంత ‘కాఫీ విత్ కరణ్’ షోలో తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి. తన మాజీ భర్తతో ఒక గదిలో ఉంటే కనుక కత్తులు ఉండొద్దని చెప్తూ.. తన మాజీ భర్తపైన ఉన్న కోపాన్ని చెప్పకనే చెప్పేసింది సమంత.

 

సమంత అటువంటి కామెంట్స్ చేసినప్పటికీ నాగచైతన్య వాటిపైన స్పందించలేదు. నాగచైతన్య తాను నటించిన తొలి హిందీ చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని తెలుగులో సమర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో పాల్గొంటున్న క్రమంలో నాగచైతన్యకు ఓ క్వశ్చన్ ఎదురైంది.

హీరోయిన్ శోభిత ధూళిపాలతో ఉన్న రిలేషన్ గురించి చెప్పాలని నాగచైతన్యను ఒకరు ప్రశ్నించారు. అప్పుడు నాగచైతన్య కాస్త సిగ్గుపడ్డాడు. తాను ఇప్పుడు నవ్వడం కంటే ఏమీ చేయలేనని అన్నాడు. అది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. హీరోయిన్ శోభిత దూళిపాళకు నాగచైతన్యకు మధ్య ఏదో ఉందని, లేకపోతే ఎందుకు నాగచైతన్య ఆ విషయమై ఖండంచలేదని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఆ హీరోయిన్ పేరు తీయగానే సిగ్గుపడుతూ ఏమీ చెప్పలేనని నాగచైతన్య అనడం వెనుక ఏదో ఉందని నెటిజన్లు అనుకుంటున్నారు. అలా ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. త్వరలో వీరిరువురి రిలేషన్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావొచ్చని కొందరు నెటిజన్లు ప్రచారం కూడా చేస్తున్నారు. నాగచైతన్య కామెంట్స్ పైన హీరోయిన్ శోభిత దూళిపాళ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి..

Read more RELATED
Recommended to you

Latest news