తెలంగాణ కాంగ్రెస్‌ను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఆయనతో పాటు పలువురు కీలక నాయకులు సైతం కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా దక్కిన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం కీలక ప్రకటన చేశారు. తాను ఈ నెల 21న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు రాజగోపాల్ రెడ్డి . తెలంగాణలో బహిరంగ సభ ఏర్పాటు చేసి… ఆ వేదికపైనే తాను బీజేపీలో చేరతానని వెల్లడించారు రాజగోపాల్ రెడ్డి.
ఈ మేరకు ఢిల్లీలో అమిత్ షాను కలిసిన అనంతరం ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు చెందిన బీజేపీ నేత వివేక్‌తో కలిసి తాను అమిత్ షాను కలిసినట్లు రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా తనను అమిత్ షా బీజేపీలోకి ఆహ్వానించారని చెప్పారు. అందుకు తాను కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలిపారు రాజగోపాల్ రెడ్డి . బీజేపీలో చేరేందుకు ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు వస్తానని అమిత్ షా చెప్పారని తెలియజేశారు రాజగోపాల్ రెడ్డి.