ఏపీలో ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన న్యూడ్ వీడియోపై రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి బయటకు వచ్చిన వీడియో ఒరిజనలో కాదో తెలియదని.. రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేయలేరా అంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. దీంతో.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. ప్రభుత్వ సలహాదారువా..? తాడేపల్లి గుమాస్తావా? అంటూ మండిపడ్డారు. అంతేకాకుండా.. వైసీపీకి ఇంటింటా కౌంట్ డౌన్ మొదలైందని, త్వరలో తాడేపల్లి ప్యాలెస్సుకు టులెట్ బోర్డు ఖాయమని, కేంద్రం ఆహ్వానం మేరకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారన్నారు అచ్చెన్నాయుడు. మీకు పడుకున్నా, లేచినా చంద్రబాబే గుర్తుకు వస్తున్నాడని, అప్పులు, కేసులపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాలపై లేదని మండిపడ్డారు అచ్చెన్నాయుడు.
బ్రిటిష్ పాలకుల మాదిరి మిమ్మల్ని త్వరలో తరిమికొట్టడం ఖాయం. గోరంట్ల మాధవ్ వ్యవహారాన్ని పక్కదారి పట్టించడానికే కుయుక్తులు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి రాజ్యాంగేతర శక్తిగా మారిన మీరు చంద్రబాబు గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమే. దేశభక్తికి సంబంధించిన అంశాలను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం వైసిపి దిగజారుడుతనానికి నిదర్శనం. దోచుకున్న లక్ష కోట్ల తాలూకు సీబీఐ, ఈడి కేసులను బయటపడటం, అప్పుల కోసం కేంద్రం వద్ద సాగిలపడటం తప్ప వైసీపీకి మరొక ఎజెండా లేదు. ముందు గడప గడపలో నిలదీస్తున్న ప్రజలకు సమాధానం చెప్పండి.