హీరో నితిన్ ‘ధైర్యం’ చిత్రంలో హీరోయిన్గా నటించిన ముద్దుగుమ్మ రైమా సేన్. ఈ హాట్ బ్యూటీ టాలీవుడ్లోకి అలా వచ్చి ఇలా కనుమరుగైపోయింది. 2005లో తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో డిజాస్టర్‌గా నిలిచింది.
అయితే టాలీవుడ్లో రాణించనప్పటికీ ఈ అమ్మడు.. హిందీ, బెంగాలీ చిత్రాల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పటి ట్రెండుకు తగ్గట్లుగా వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తోంది. అలానే 42 ఏళ్ళ వయసులోనూ కుర్రాళ్లకు చెమటలు పట్టించే నాజూకు అందాన్ని మెయిన్‌టెయిన్ చేస్తోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టా గ్రామ్‌లో అదిరిపోయే పోజులతో ఫొటోలను, వీడియోను పోస్ట్ చేసింది. వీటిని చూస్తే.. ఆమె సోయగాలు ఎలాంటివో అర్థం అవుతుంది. కళ్ళు చెదిరే హాట్ నెస్‌తో వేడి సెగలు పుట్టిస్తోంది. ఇందులో ఆమె మోనోకిని డ్రెస్‌పై గ్రీన్ జాకెట్ ధరించింది స్టైలిష్‌గా అంతకు మించి హాట్‌గా కనిపించింది.
ఈ ఫోటోషూట్‌లో రైమాసేన్ క్లీవేజ్ అందాలతో ఫుల్ ఎక్స్పోజింగ్ చేసింది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయిన ఈ బాంబ్ బ్లాస్టింగ్ పోజులు కుర్రాళ్లను కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో ఆమె పోస్ట్ చేసిన బికినీ అందాలు కూడా నెటిజన్ల మతి పోగొట్టే విధంగా ఆకట్టుకున్నాయి.
కాగా, ఈ అందాల హాట్ బ్యూటీ నాలుగు పదుల వయసు దాటినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా దాటవేస్తోంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు 2000 లోనే హీరోయిన్గా ఆఫర్స్ అందుకుంది. ప్రస్తుతం సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లతోనూ అలరిస్తోంది. రీసెంట్గా ది లాస్ట్ అవర్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది.