Breaking : తెలంగాణలో తొలి కేజీ టూ పీజీ విద్యాలయం పూర్తి..

-

సీఎం కేసీఆర్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో కేజీ టూ పీజీ విద్య ఒకటి. అయితే.. మొట్టమొదటి కేజీ టూ పీజీ ఉచిత విద్యాలయ భవనం నిర్మాణం పూర్తి అయ్యింది. దీనికి సంబంధించిన ఫోటోలో నెట్టింట్లో వైరల్‌గా మారాయి. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఆవిర్భ‌వించాక తొలి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్‌… రాష్ట్ర విద్యా వ్య‌వ‌స్థ‌లో నూత‌న విధానాల‌ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగానే కేజీ (కిండ‌ర్ గార్టెన్‌) టూ పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేష‌న్‌) దాకా ఒకే చోట పూర్తి చేసుకునేలా విద్యార్థుల‌కు నూత‌న విద్యాల‌యాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆ ప్ర‌క‌ట‌న‌కు అనుగుణంగానే తొలి కేజీటూపీజీ విద్యాల‌యాన్ని తెలంగాణ స‌ర్కారు నిర్మించింది.

Image

రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ప‌రిధిలోని గంభీరావుపేట‌లో తొలి కేజీటూపీజీ విద్యాల‌యాన్ని నెల‌కొల్ప‌నున్న‌ట్లు కేసీఆర్ స‌ర్కారు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క‌ట‌న‌కు అనుగుణంగానే ప్ర‌స్తుతం గంభీరావుపేట‌లో తొలి కేజీటూపీజీ విద్యాల‌యాన్ని నిర్మించింది. ఈ విద్యాల‌యంలోని వ‌సతులు, భ‌వ‌న నిర్మాణం త‌దిత‌రాల‌ను వెల్ల‌డిస్తూ తెలంగాణ రెనూవ‌బుల్ ఎన‌ర్జీ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ స‌తీశ్‌ రెడ్డి గురువారం ఓ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news