Breaking : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన

-

తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడనంటున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే.. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న ఉదయం 8.30 గంటలకు ఏర్పడిన ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదలుతోంది.

Low pressure in the Bay of Bengal - Sakshi

నేడు ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అలాగే, ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పడమర గాలుల ప్రభావం ఉంది. ఫలితంగా కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు కురవడంతోపాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వివరించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news