లైగర్ సినిమాలో మైక్ టైసన్ నటిస్తుంటే.. షాకింగ్ కామెంట్స్ చేసిన ఆయన భార్య..!!

-

ప్రముఖ బాక్సింగ్ దిగ్గజం అయినటువంటి మైక్ టైసన్ మొదటి సారి కెమెరా ముందుకు రావడం జరిగింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా లైగర్. ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 3000కు పైగా థియేటర్లలో విడుదలై మంచి హైప్ ను క్రియేట్ చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందే పెద్ద ఎత్తున భారతదేశమంతటా ప్రమోషన్స్ కార్యక్రమాలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఇలా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న చిత్ర బృందం ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడించారు. ఇకపోతే ఇటీవల పూరీ జగన్నాథ్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో కలిసి ఒక చిట్ చాట్ నిర్వహించారు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగానే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను కూడా పూరీ జగన్నాథ్ పంచుకోవడం జరిగింది.

ఇకపోతే సుకుమార్ మాట్లాడుతూ.. మైక్ టైసన్ ఈ సినిమాలో నటించారు కదా? ఆయనను తీసుకోవాలని ఆలోచన మీకు ఎలా వచ్చిందని ప్రశ్నించగా.. అందుకు పూరీ జగన్నాథ్ సమాధానం చెబుతూ ఈ సినిమాలో మైక్ టైసన్ లాంటి వ్యక్తి నటిస్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది. వచ్చి రాగానే అలాంటి వ్యక్తి ఎందుకు.. అతనే నటిస్తే సరిపోతుంది కదా అనుకున్నాము.. ఇక ఛార్మీ వెళ్లి అతనిని ఒప్పించడానికి సుమారు సంవత్సరం పాటు కష్టపడింది. చివరికి ఆయన ఒప్పుకున్నారు.. ఇక ఆయన ఒప్పుకొని సినిమా షూటింగ్ లొకేషన్లోకి వచ్చేవరకు మాకందరకు చాలా టెన్షన్ గా ఉండేది అని పూరీ జగన్నాథ్ వెల్లడించారు.

అయితే సినిమా షూటింగ్ లొకేషన్లోకి మైక్ టైసన్ అడుగుపెట్టగానే మేము ఊపిరి పీల్చుకున్నాము. అయితే ఈ సినిమాలో మైక్ టైసన్ నటిస్తున్న సమయంలో ఆయన భార్య మాట్లాడుతూ.. మా ఆయన ఫైటర్ యాక్టర్ కాదు అని చెప్పారు అంటూ పూరీ జగన్నాథ్ ఈ సందర్భంగా మైక్ టైసన్ గురించి తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news