కాంగ్రెస్‌కు సూపర్ ఛాన్స్..యూజ్ చేసుకుంటుందా!

-

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్-బీజేపీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది..ఈ పోరులో టీఆర్ఎస్ పార్టీకి కాస్త ఎం‌ఐ‌ఎం కూడా తోడైనట్లు కనిపిస్తోంది. ఇటీవల చోటు చేసుకున్న అనుహ్యా పరిణామాలతో రెండు పార్టీల మధ్య వార్ తీవ్ర స్థాయిలో నడుస్తోంది. టీఆర్ఎస్-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధమే కాదు..ఏకంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్ళిపోయారు.

ఎవరికి వారు రాజకీయంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో రావడంతో, ఆ అంశాన్ని ఉపయోగించుకుని బీజేపీ రాజకీయం నడిపిస్తుంది. ఇటు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్..మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆయన్ని బీజేపీ సస్పెండ్ చేయడం జరిగాయి..అయితే ఇదే అంశాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆయుధంగా తీసుకుని..బీజేపీని ఇరుకున పెట్టే కార్యక్రమాలు చేస్తుంది. అటు ఎం‌ఐ‌ఎం సైతం బీజేపీ టార్గెట్ గా పాతబస్తీలో నిరసన కార్యక్రమాలు చేస్తుంది.

ఇలా టీఆర్ఎస్-బీజేపీల రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తోంది…కానీ ఈ యుద్ధంలో కాంగ్రెస్ లేదు. అయితే ఇది కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశమని చెప్పొచ్చు. ఆ రెండు పార్టీలు రాజకీయ క్రీడలో ఉన్నాయి. ఇలాంటప్పుడు కాంగ్రెస్ సైలెంట్ గా ప్రజల్లోకి వెళ్ళి…ప్రజా మద్ధతు పెంచుకోవచ్చు. ముఖ్యంగా మునుగోడులో మంచి అవకాశం దొరికినట్లే. టీఆర్ఎస్-బీజేపీలపై వస్తున్న ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ సరిగ్గా యూజ్ చేసుకుంటే మునుగోడులో సత్తా చాటవచ్చు.

అయితే ఈ అంశాన్ని కాంగ్రెస్ సైలెంట్‌గా యూజ్ చేసుకుంటుందా? లేదా? అనేది చూడాలి. ఎందుకంటే బయట సమస్యల కంటే ఆ పార్టీలోనే సొంత సమస్యలు ఎక్కువ. ఆ సమస్యలు తీరతాయో లేదో తెలియడం లేదు. అయినా సరే ఇలాంటి పరిస్తితుల్లో కాంగ్రెస్ బలపడటానికి మంచిగా అవకాశాలు ఉన్నాయి. మరి ఆ అవకాశాలని ఉపయోగించుకుంటే….కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది…లేదంటే కాంగ్రెస్ పరిస్తితి ఎప్పటిలాగానే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news