నేడు ఓల్డ్ సిటీలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ నేడు ప్రారంభం కానుంది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ ఫ్లైఓవర్ ని ప్రారంభించనున్నారు. అయితే గత నాలుగు రోజుల కింద కేటీఆర్ ఈ ఫ్లైఓవర్ ని ప్రారంభించాల్సి ఉండగా.. బిజెపి నేతల అరెస్టులు, ఆందోళనలో జరుగుతున్న నేపథ్యంలో ఫ్లైఓవర్ ఓపెనింగ్ ను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. తాజాగా నేడు ఈ ఫ్లైఓవర్ ని ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్.
దీంతో ఓల్డ్ సిటీలో హై టెన్షన్ చోటుు చేసుకుంది. ఓవైపు బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలతో ఓల్డ్ సిటీ అంతా అగ్గి మీద గుగ్గిలమవుతుంది. మరోవైపు బజరంగ్దళ్, వీహెచ్పీ కార్యకర్తలు సైతం రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేయడంతో మండిపడుతున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ ఓల్డ్ సిటీ పర్యటన ఆసక్తిని రేకెత్తిస్తుంది. మంత్రి పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం జరగనుంది.