లెనోవో అద్భుత‌మైన ఆఫ‌ర్‌.. మీ ల్యాప్‌టాప్‌ను మీరే త‌యారు చేసుకొండి..!

-

లెనోవో ‘మేడ్ టు ఆర్డ‌ర్’ పేరిట ఓ నూత‌న సేవ‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని స‌హాయంతో ఇక‌పై ల్యాప్‌టాప్‌లు కొనాల‌నుకునే ఎవ‌రైనా స‌రే.. త‌మ‌కు న‌చ్చిన కాన్ఫిగ‌రేష‌న్ క‌లిగిన ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

సాధార‌ణంగా మ‌నం కొత్త డెస్క్‌టాప్ కంప్యూట‌ర్‌ను కొనాలంటే.. మ‌న‌కు న‌చ్చిన కాన్ఫిగ‌రేష‌న్ క‌లిగిన పార్ట్స్‌ను కొనుగోలు చేసి.. అనంత‌రం వాటిని అసెంబుల్ చేసి కంప్యూట‌ర్‌ను ఏర్పాటు చేసుకుంటాం. కానీ ల్యాప్‌టాప్‌ల‌ను కొంటే ఆ వెసులుబాటు ఉంటుంది. కంపెనీ ఇచ్చే కాన్ఫిగ‌రేష‌న్‌ల‌తో కూడిన ల్యాప్‌టాప్‌ల‌లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవాలి. కుదిరితే వాటిల్లో ర్యామ్ లేదా స్టోరేజ్ మాత్ర‌మే పెంచుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ ఇత‌ర ఏ ఫీచ‌ర్ల‌ను మారుద్దామ‌న్నా కుద‌ర‌దు. దీంతో కొంద‌రు త‌మ‌కు న‌చ్చిన కాన్ఫిగ‌రేష‌న్‌తో కూడిన ల్యాప్‌టాప్‌ల‌ను పొంద‌లేకపోతుంటారు. అయితే అలాంటి వారి కోస‌మే లెనోవో ఓ అద్భుత‌మైన అవ‌కాశాన్ని అందిస్తోంది. అదేమిటంటే..

లెనోవో ‘మేడ్ టు ఆర్డ‌ర్’ పేరిట ఓ నూత‌న సేవ‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని స‌హాయంతో ఇక‌పై ల్యాప్‌టాప్‌లు కొనాల‌నుకునే ఎవ‌రైనా స‌రే.. త‌మ‌కు న‌చ్చిన కాన్ఫిగ‌రేష‌న్ క‌లిగిన ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. అందుకుగాను వారు తాము కొనుగోలు చేయాల‌నుకునే ల్యాప్‌టాప్‌లో ఏయే ఫీచ‌ర్లు కావాలో అన్నీ న‌చ్చిన‌వే సెలెక్ట్ చేసుకోవ‌చ్చు. అంటే.. గ్రాఫిక్స్‌, స్టోరేజ్‌, డిస్‌ప్లే, ర్యామ్.. ఇలా అన్న‌మాట‌. ఇలా త‌మకు న‌చ్చిన ఫీచ‌ర్లు, కాన్ఫిగ‌రేష‌న్ తో ల్యాప్‌టాప్ కావాల‌ని ఆర్డ‌ర్ చేయాలి. దీంతో లెనోవో ఆర్డ‌ర్ అందుకున్న 2 వారాల్లోగా ఆ క‌స్ట‌మ‌ర్‌కు అత‌ను కోరుకున్న విధ‌మైన ఫీచ‌ర్లు, కాన్ఫిగ‌రేష‌న్ క‌లిగిన ల్యాప్‌టాప్‌ను త‌యారు చేసి ఇస్తుంది.

అయితే ప్ర‌స్తుతం లెనోవో కేవ‌లం థింక్ ప్యాడ్ ల్యాప్‌టాప్‌ల‌కే ఈ అవ‌కాశాన్ని అందిస్తుండ‌గా.. వాటికి ఏకంగా 1 ల‌క్ష వ‌ర‌కు కాన్ఫిగ‌రేష‌న్ ఆప్ష‌న్ల‌ను అందిస్తోంది. ఇక క‌స్ట‌మ‌ర్లు ఎంచుకున్న కాన్ఫిగ‌రేష‌న్‌ను బ‌ట్టి ల్యాప్‌టాప్ ధ‌ర ఉంటుంది. మరి ఇంకెందుకాల‌స్యం.. మీకు కూడా మీకు న‌చ్చిన కాన్ఫిగ‌రేష‌న్ క‌లిగిన ల్యాప్‌టాప్ కావాలంటే.. వెంట‌నే లెనోవో వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి మ‌రి..!

Read more RELATED
Recommended to you

Latest news