యాచకుడి మృతి.. బ్యాగులో ఎంత డబ్బుందో తెలుసా?

-

ఏపీలోని గుంతకల్ కు చెందిన యాచకుడు అనారోగ్యంతో కన్నుమూశాడు. దీంతో అతడి బ్యాగ్ ను పోలీసులు చెక్ చేసి కంగుతిన్నారు. అతడి బ్యాగ్ లో నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి.

మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాం. బిచ్చం ఎత్తుకునే బిచ్చగాళ్లు కూడా లక్షలు సంపాదిస్తుంటారు. కేవలం బిచ్చం ఎత్తుకొని లక్షలు సంపాదించి షాక్ కు గురి చేస్తుంటారు. అచ్చం సినీ ఫక్కీలోనే నిజంగా కూడా రిచ్ బెగ్గర్లు ఉన్నారు. కొందరు లక్షలు లక్షలు కూడబెడతారు. వాళ్లకు బ్యాంకు అకౌంట్లు, ఇండ్లు ఉండవు కాబట్టి.. తమతో పాటే ఆ డబ్బును దాచుకుంటారు. ఒకవేళ వాళ్లు చనిపోతే అప్పుడే వాళ్లు కూడబెట్టిన డబ్బు బయటపడుతుంది. అటువంటి ఘటనలు మనం చాలానే చూశాం. తాజాగా అటువంటి ఘటనే మరోటి జరిగింది.

ఏపీలోని గుంతకల్ కు చెందిన యాచకుడు అనారోగ్యంతో కన్నుమూశాడు. దీంతో అతడి బ్యాగ్ ను పోలీసులు చెక్ చేసి కంగుతిన్నారు. అతడి బ్యాగ్ లో నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి.

పాత గుంతకల్లు మస్తానయ్య దర్గా దగ్గర షేక్ బషీర్ అనే వ్యక్తి 12 ఏళ్లుగా యాచక వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నాడు. భిక్షాటనతో వచ్చిన డబ్బులతో జీవనం పొందుతున్నాడు. 12 ఏళ్ల నుంచి బషీర్ అక్కడే ఉండేవాడు. అయితే.. రెండు రోజుల క్రితం అనారోగ్యంతో బషీర్ చనిపోయాడు. అతడి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని అతడు నివాసం ఉండే చోట ఉన్న అతడి బ్యాగును స్వాధీనం చేసుకున్నారు.

పోలీస్ స్టేషన్ వెళ్లాక.. ఆ బ్యాగును ఓపెన్ చేసి చూసిన పోలీసులు షాక్ అయ్యారు. ఎందుకంటే.. ఆ బ్యాగులో బట్టలతో పాటు.. నోట్ల కట్టలు కనిపించాయి. ఆ డబ్బులను లెక్కించగా… మొత్తం 3,23,217 రూపాయలు ఉన్నాయి. వాటిలో 13 వేల రూపాయలను తీసి బషీర్ అంత్యక్రియల కోసం ఉపయోగించారు. మిగితా డబ్బును ప్రభుత్వ ఖజానాలో జమ చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. భిక్షాటన చేసే ఆ వ్యక్తి వద్ద అంత డబ్బు ఉందని తెలుసుకున్న స్థానికులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news