సీఎం కేసీఆర్ నేడు పెద్దపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తూ.. రైతుల పట్ల కఠినంగా ప్రవర్తిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2024లో ఈ దేశం నుంచి బీజేపీని పారద్రోలాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. రైతులకు మీటర్ పెట్టాలని అంటున్న ఈ మోదీకే మీటర్ పెట్టాలన్నారని, రైతులకు మేలు చేస్తూ పేదలను ఆదుకుంటుంటే వాటిని ఉచితాలు అని బంద్ పెట్టాలని అంటున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఉచిత కరెంట్ ఇస్తే మీటర్ పెట్టాలని అంటున్నారని, రేపు రాబోయే భారతదేశంలో ఈ బీజేపీని పారదోలి రైతుల ప్రభుత్వం రాబోతుందన్నారు సీఎం కేసీఆర్. జాతీయ రాజకీయాల్లోకి పోదామా అన్నారు సీఎం కేసీఆర్. ఈ గోల్ మాల్ ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం పచ్చి అబద్దాల ఆడుతూ, దేశ ప్రజలను మోసం చేస్తున్నారన్నా సీఎం కేసీఆర్.. దేశంలోని మొత్తం వ్యవసాయానికి వాడే కరెంట్ కేవలం 20.8 శాతం మాత్రమేనని, దాని ఖరీదు ఒక లక్షా 45 వేల కోట్లు. ఓ కార్పొరేట్ దొంగకు దోచిపెట్టినంత కాదు కదా మోదీ
అంటూ సీఎం కేసీఆర్ సెటైర్లు వేశారు.