హీరో వైష్ణవ్​ తేజ్​ దిశ మార్చిన ఆ ఒక్క ఫొటో ఏంటో తెలుసా?

-

తొలి సినిమాతోనే సూపర్‌ హిట్‌ అందుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న నటుడు వైష్ణవ్‌ తేజ్‌.. జానీలో తెరపైకి వచ్చి.. శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లో ఆసుపత్రిలో కోమాలో ఉండే పాత్రలో కనిపించిన చిన్న కుర్రాడే ఇప్పుడు హీరోగా దూసుకెళ్తున్నారు. త్వరలోనే ‘రంగరంగ వైభవంగా’ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హీరో వైష్ణవ్‌తేజ్‌, దర్శకుడు గిరీశాయ ఈటీవీ ఆలీతో సరదా కార్యక్రమానికి వచ్చారు. తమ అనుభవాలు, సినిమా అనుభూతులను పంచుకున్నారు.

అలీతో సరదాగా
అలీతో సరదాగా

హీరో కావాలనే ఆలోచన ఎలా వచ్చింది..?

వైష్ణవ్‌ తేజ్‌: హీరో కావాలని అనుకోలేదు. చిన్నప్పటి నుంచి కెమెరా వెనక ఉండాలనుకున్నా. ఫైట్స్‌, డైరెక్షన్‌ ఆసక్తిగా ఉండేది. ఓ రోజు కళ్యాణ్‌గారు చూసి.. ‘హీరోనే ఎందుకు? నటుడిగా తయారవ్వు’ అన్నారు. ‘విభిన్న పాత్రలు చెయ్’ అని చెప్పడంతో ఆ ఆలోచన బాగా నచ్చింది. బుచ్చిబాబు ఇన్‌స్టాలో నా ఫొటో చూసి సుకుమార్‌తో చెప్పడం.. మాట్లాడటం అలా అయిపోయింది.

‘శంకర్‌దాదా’లో నువ్వే కదా నటించింది. అదే మొదటి సినిమానా..? పెద్దమావయ్య సలహాలు ఇచ్చేవారా..?

వైష్ణవ్‌ తేజ్‌: కాదండీ.. ముందు ‘జానీ’, ఆ తర్వాత ‘శంకర్‌దాదా’, ‘అందరివాడు’లలో పాత్రలు చేశా. ఒక సీన్‌లో నవ్వుతూ ఉండటంతో పెద్ద మావయ్య కోప్పడ్డారు. ఇక అంతే. జాగ్రత్తగా చేశా.

వైష్ణవ్ తేజ్
వైష్ణవ్ తేజ్

ఉప్పెన కథ మొదటగా ఎవరు విన్నారు..?

వైష్ణవ్‌ తేజ్‌: నేనే విన్నా. కొంచెం భయపడ్డా.. ఏంటీ ఈ కథా..? అనుకున్నాను. తర్వాత సుకుమార్‌, మైత్రీవాళ్లు చిరంజీవిగారిని కలిసి చెప్పారు. మావయ్య నన్ను పిలిచి ‘ధైర్యంగా వెళ్లిపో. కొత్త తరహా కథ’ అన్నారు. ఇక ఆలోచించలేదు. ముందుకు వెళ్లిపోయాను.

‘నీ కళ్లు నీలి సముద్రం’, ‘జల జల పాతం’..పాట దర్శకుడి ఆలోచనేనా..? ఆ కెమిస్ట్రీ ఎలా కుదిరింది..?

వైష్ణవ్‌ తేజ్‌: నీ కళ్లు నీలి సముద్రం పాట బుచ్చిబాబుదే.. సూఫియాలా ఉండాలనుకుని చేయించారు. ‘జల జలపాతం’ పాటకు బుచ్చిబాబే ఎలా చేయాలనే ఆలోచన ఇచ్చారు.. అంత మందిలో ప్రైవసీగా చేయలేం కదా! బోటు ఊపుతుంటే.. వంద మంది మధ్యలో షూట్‌ చేశారు. ఇలాంటి సాంగ్‌ పెద్ద మావయ్య, కళ్యాణ్‌ ఎవరూ చేయలేదు.

రాబోయే కొత్త సినిమాకు దర్శకుడు, హీరోయిన్‌ ఎవరు..?

వైష్ణవ్‌ తేజ్‌: ఇది ‘ఉప్పెన’ ముందు అనుకున్న సినిమా. విక్రమ్‌ కొడుకుతో ‘ధ్రువ్‌ విక్రమ్‌’తో ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌ చేశారు. ఆయనే గిరీశాయ. మొదట్లో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందని చెప్పా. అన్నీ కుదిరిన తర్వాత ఇప్పుడు ఇలా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఇందులో కేతికశర్మ హీరోయిన్‌. ఇంతకు ముందు ఆమె ‘రొమాంటిక్‌’లో నటించింది.

వైష్ణవ్ తేజ్
వైష్ణవ్ తేజ్

రంగ రంగ వైభవంగా దర్శకునికి 10లో ఎన్ని మార్కులు ఇస్తావు..?

వైష్ణవ్‌ తేజ్‌: నాకు మార్కులు ఇచ్చేంత సీన్‌ లేదు. ఆయనకు ఏం కావాలో చేయించుకుంటారు. భవిష్యత్తులో మంచి డైరెక్టర్‌ అవుతారు.

ఇండస్ట్రీకి రాకముందు ఇంజినీరు, సైంటిస్టు, సైనికుడు కావాలనే కోరికలుండేవట..?

వైష్ణవ్‌ తేజ్‌: అవును. ఏం చేయాలో తెలియదు. నిహారిక మాస్‌ కమ్యూనికేషన్‌ చేస్తే నేను చేశా. డిగ్రీ మూడో సంవత్సరంలో అందరూ ఉద్యోగాల్లోకి వెళ్లిపోతున్నారు. నాకేం తోచలేదు. జిమ్‌కు వెళ్లేవాడిని. కిక్‌బాక్సింగ్‌ చేశా. కళ్యాణ్‌గారు చెబితే థాయిలాండ్‌ వెళ్లి మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నా. ఇంటికి వచ్చిన తర్వాత కిక్‌బాక్సింగ్‌ ట్రైయినర్‌ అవుదామనుకున్నా. మధ్యలో జ్యూయలరీ డిజైనర్‌ అవుతామనుకున్నా. యానిమేషన్‌ చేద్దామనుకున్నా. ఏదీ ఫైనల్‌ కాలేదు. నా దగ్గర ప్రాణం తప్ప ఇంకేం లేదు. దేశానికి ఇచ్చేద్దామనుకున్నా.. ఆర్మీ లైఫ్‌ అంతా ఈజీ కాదు. చాలా కష్టపడాలి. ‘నువ్వు చేయలేవ’ని అమ్మా చెప్పింది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చేశా..!

శర్వానంద్‌ సినిమా చూస్తున్నప్పుడు నిహారికను ఏడువొద్దని చెప్పి చివరగా నువ్వే ఏడ్చావట..?

వైష్ణవ్‌ తేజ్‌: అమ్మ చెప్పింది సినిమా చూస్తుంటే అది జరిగింది. అందరూ ఏడుస్తున్నారు. వెనక శర్వా అన్న ఉన్నాడు.. ఊరుకో అన్నా. అంతా కళ్లు తుడుచుకున్నారు. నేను శర్వా దగ్గరకు వెళ్లి పట్టుకొని ఏడ్చా.

వైష్ణవ్ తేజ్
వైష్ణవ్ తేజ్

ఎవరైనా కథ తీసుకొచ్చినప్పుడు నువ్వు ఒకే చేస్తావా..? ఎవరైనా వినాలా..?

వైష్ణవ్‌ తేజ్‌: మొదటి సినిమా ఒక్కటే చిరంజీవి మావయ్య చేతుల మీదుగా జరగాలనుకున్నా.. నా సినిమా కథలను నేనే ఒకే చేస్తా.

కాలేజ్‌లో కో-ఎడ్యుకేషన్‌ కదా! సీనియర్‌తో క్రష్‌లో పడ్డావట..?

వైష్ణవ్‌ తేజ్‌: సెయింట్‌ మేరీస్‌లో చదివా. నాకెప్పుడూ సీనియర్లంటేనే క్రష్‌ ఉంటుంది. అదెంటో తెలియదు. ధైర్యం లేక ఏం చెప్పలేదు.

పెద్ద మావయ్య, కళ్యాణ్‌ మావయ్య సినిమాలలో ఏవీ ఇష్టం..?

వైష్ణవ్‌ తేజ్‌: పెద్దమావయ్య సినిమాల్లో ఖైదీ, బావగారు బాగున్నారా..? ఇంద్ర, ఠాగూర్‌, స్టాలిన్‌ ఇలా అన్ని సినిమాలు ఇష్టమే. కళ్యాణ్‌ మావయ్య సినిమాల్లో తమ్ముడు,బద్రీ సినిమాలను వందసార్లకుపైగా చూశా.

వైష్ణవ్ తేజ్
వైష్ణవ్ తేజ్

డ్యాన్స్‌లలో ఎవరంటే ఇష్టం…?

వైష్ణవ్‌ తేజ్‌: చరణ్‌ అంటే ఇష్టం. నాకు డ్యాన్సు అంతగా రాదు.(తమ్ముడు సినిమా పాటకు డ్యాన్స్‌ను ఆలీతో కలిసి చేశారు)

అన్నయ్య ఎలా ఉన్నారు..? అన్నయ్యతో ఎలాంటి సినిమా చేయాలని ఉంది..? మీ మావయ్యల పాటల్లో దేన్ని రీమేక్‌ చేయాలని ఉంది..?

వైష్ణవ్‌ తేజ్‌: బాగున్నాడు. సినిమా షూటింగ్‌లకు వెళ్తున్నాడు. ఒక షెడ్యూల్‌ కూడా పూర్తయింది. నాకైతే అన్నయ్యతో యాక్షన్‌ సినిమా చేయాలని ఉంది. పెద్దమావయ్య సినిమాల్లో దాయి దాయి దామ్మా…కళ్యాణ్‌ మామ ఖుషీ పాట, వెంకటేష్‌ గారి పాటకు ప్రాణం ఎక్కడైనా బ్యాక్‌గ్రౌండ్‌లో వాడాలని ఉంది.

చరణ్‌ సినిమాల్లో ది బెస్ట్‌ ఏదీ అనిపించింది..? అన్నయ్య సినిమాల్లో…? బన్నీసినిమాల్లో బాగా నచ్చింది..?

వైష్ణవ్‌ తేజ్‌: ‘ఆర్ఆర్ఆర్‌’, ‘మగధీర’ చాలా ఇష్టం. అన్నయ్య సినిమాల్లో ‘సుప్రీమ్‌’ బాగా నచ్చింది. బన్ని సినిమాల్లో ‘పుష్ప’, ‘హ్యాపీ’, ‘ఆర్య1, 2’ బాగుంటాయి.

లావుగా ఉన్నప్పుడు ఫుడ్‌ కాంపిటేషన్‌ పెట్టారట..?

వైష్ణవ్‌ తేజ్‌: వారాంతంలో నాగ మావయ్య ఇంటికి వెళ్లేవాడిని. మాతో పాటు వరుణ్‌, నిహారిక, ఇంకొంత మంది ఉండేవాళ్లం. మావయ్య బెడ్‌రూంలో ఫ్రిజ్‌ ఉండేది. అందులో చాక్లెట్లు, పండ్లు ఉండేవి. మా నాన్న కాంబినేషన్‌ అని ఉప్మా తెచ్చి అందులో ఆవకాయ, ఆఫ్‌ బాయిల్డ్‌ ఎగ్‌ పెట్టి తినిపించారు. చాలా బాగుంది.

ఈ షోకి డైరెక్టర్‌ కూడా వచ్చారు. ఆయనకు నీపై చాలా ఫిర్యాదులు ఉన్నాయట..ఆయన నోటితోనే చెప్పిస్తా..!

వైష్ణవ్‌ తేజ్‌: ఓకే. చెప్పించండి. ఈ సినిమాలో సత్య సీన్‌ చాలా ఎంజాయ్‌ చేశా.

ఇది మీ తొలి తెలుగు సినిమా కదా..? మీ స్వస్థలం ఎక్కడ..? తెలుగు అబ్బాయి తమిళ సినిమా ఎలా చేయాల్సి వచ్చింది..?

గిరిశాయ: మాది పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం. భీమవరం దగ్గరలోనే ఉంటుంది. అర్జున్‌రెడ్డి సినిమాను విక్రమ్‌ కొడుకుతో తీయాలనుకున్నారు. ఆ సమయంలో సందీప్‌కు వీలు పడలేదు. నా పేరు చెబితే ఆ సినిమా ఛాన్సు వచ్చింది.

ఈ సినిమా ఛాన్సు నిర్మాతతోనా, హీరో చెప్పడంతో వచ్చిందా..?

గిరిశాయ: వైష్ణవ్‌తోనే వచ్చింది. ఆదిత్యవర్మ సినిమా చేసే సమయంలో ఉప్పెన ఇంకా విడుదల కాలేదు. కాఫీ షాప్‌లో వైష్ణవ్‌ను చూశా. అప్పుడే అనుకున్నా. ఇతనైతే బాగుంటుందని.. నాలుగైదు సిట్టింగ్‌లతో కథ ఒకే అయ్యింది.

డైరెక్టర్‌ కాకముందు ఎవరి దగ్గర పని చేశారు..?

గిరీశాయ: 14, 15 సినిమాలకు పని చేశాను. కృష్ణారెడ్డితో యమలీల, భీమవరం బుల్లోడు, సందీప్‌రెడ్డి దగ్గర అర్జున్‌రెడ్డి సినిమాకు చేశా.

కాటుక కళ్లని అమ్మాయిలను అంటాం.. కానీ మీ కళ్లు కాటుక పెట్టినట్టు ఉంటాయి..?

వైష్ణవ్‌ తేజ్‌: తాతయ్యకు ఉన్నట్టే నాకు ఉన్నాయి. చాలా మంది అనుకుంటారు. కాటుక పెట్టుకొని వచ్చారని.. అది నిజం కాదు.

క్రిష్‌తో పని చేశావు కదా..ఎలా అనిపించింది..? ఆ సినిమా చేసిన తర్వాత వర్కవుట్‌ అవుతుందనిపించిందా..?

వైష్ణవ్‌ తేజ్‌: ఆయన చాలా ఫాస్ట్‌. ఏ సీన్‌ ఎంతవరకు చేయాలో అంతే చేయిస్తారు. ఆ సినిమా చేసిన తర్వాత ఎక్కడో తేడా కొడుతుందనిపించింది. క్రిష్‌గారు మాత్రం నమ్మకంతో ఉన్నారు. ముందుగా చెప్పిన కథ నన్ను ఇంప్రెస్‌ చేసింది. మధ్యలో కథ మార్చడంతో తేడా వచ్చింది. అంతా అయిపోయాక నచ్చకపోయినా ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నా.

ఉప్పెనలో పెద్దమావయ్య కొన్ని మార్పులు సూచించారట..ఏవీ.?

వైష్ణవ్‌ తేజ్‌: మొదట్లో హీరో పాత్ర మరీ మాస్‌గా ఉండేది. ‘మారి’లో ధనుష్‌లాగా. వైషుకు మొదటి సినిమా కదా. క్యూట్‌గా చేద్దాం అనడంతో బుచ్చిబాబు దాని చుట్టూ కథ అల్లుకున్నారు.

ఉప్పెనలో చేపలు, కొండపొలంలో మేకలు పట్టావు..ఈ సినిమాలో ఏం పట్టుకున్నావ్‌..?

వైష్ణవ్‌ తేజ్‌: అమ్మాయిని పట్టాను. ఇందులో అలా కుదిరింది. (నవ్వులు)

Read more RELATED
Recommended to you

Latest news