దేశంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాయి, వరుస లేకుండా.. లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. మన ఇండియాలో ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువే. అయితే.. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. నిజామాబాద్ ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందిన అధికార పార్టీ వార్డు మెంబర్ బైరా చంద్రశేఖర్ ఓ వివాహితతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు.
అయితే ఆమె మొదటి భర్త ద్వారా ఆమెకు అప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిని ఆర్మూర్ లోని మామిడిపల్లి చౌరస్తా ప్రాంతంలో ఒక ఇంట్లో అద్దెకు ఉంచాడు. అయితే ఆ మహిళ ఆదివారం రోజు పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష రాసేందుకు వెళ్ళింది. అయితే అదే సమయంలో ఇంటికి వచ్చిన వార్డు మెంబర్ చంద్రశేఖర్ పిల్లలకు ఐస్ క్రీమ్ లో మత్తుమందు కలిపి తినిపించాడు. పిల్లలు మత్తులో ఉండగా 16 సంవత్సరాల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
బాధిత మైనర్ బాలికకు తీవ్రంగా రక్తస్రావం కావడంతో, ఆసుపత్రిలో చేర్చి బాలిక తల్లి ఫోన్ నంబర్ ఇచ్చి పరార్ అయ్యాడు. విషయం తెలిపిన బాధితురాలి తల్లి స్థానిక ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. చికిత్స అందిస్తున్నారు. అయితే అత్యాచారం చేసిన వార్డు సభ్యుడు బైర చంద్రశేఖర్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.