నిద్రలేచిన తర్వాత చాలామందికి కొంతసేపు వరకూ తిక్క తిక్కగా ఉంటుంది. కళ్లుతిరుగుతున్నట్లు, తలనొప్పిగా ఉంటుంది. ఆ టైంలో వాళ్లు మాట్లాడటానికి కూడా అంత ఇష్టపడరు. అయితే తరచూ నిద్రలేచిన తర్వాత తలనొప్పి ఉంటుంటే. ఏమాత్రం లైట్ తీసుకోవద్దంటున్నారు నిపుణులు.
తలనొప్పికి అనేక కారణాలు ఉండవచ్చు. శరీరం డీహైడ్రేట్ అయితే.. తలనొప్పి సమస్య వస్తుంది. ఇది కాకుండా ఒత్తిడి ఉన్నా, అలసిపోయినా కూడా తలనొప్పి వస్తుంది. ఉదయాన్నే తలనొప్పి వస్తుంటే.. కొన్ని చిట్కాల ద్వారా నయం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉదయాన్నే తలనొప్పిని వదిలించుకోవాలంటే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు.. ఈ మేరకు అమెరికన్ మైగ్రేన్ ఫౌండేషన్ కొన్ని చిట్కాలను సూచించింది. ఉదయం తలనొప్పిని నివారించడానికి వీటిని అనుసరించవచ్చు.
ఉదయం వేళ తలనొప్పిని నివారించాలనుకుంటే ఖచ్చితంగా 7-8 గంటలపాటు నిద్ర పోవాలి. అలా అని ఎప్పుడో అర్థరాత్రి నిద్రపోతా అంటే కుదరదు.. నిర్ణీత సమయంలో నిద్రించాలి. రాత్రివేళ ఆలస్యంగా కాకుండా త్వరగా పడుకోవాలి.
తరచూ ఉదయం వేళ తలనొప్పి వస్తుంటే.. ప్రతిరోజూ వ్యాయామం చేయండి. వ్యాయామం చేయడం వల్ల ఉదయం వచ్చే తలనొప్పి తీవ్రత, సమస్య తగ్గుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఉదయాన్నే తలనొప్పిని వదిలించుకోవాలనుకుంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచాలి. ఇందుకోసం బాడీకి సరిపడా నీరు తాగాలి. అంటే కనీసం నాలుగు లీటర్ల వాటర్ తాగాలి.
ఉదయం తలనొప్పితో బాధపడుతుంటే ఓ డైరీని మెయింటేన్ చేయండి.. ఎప్పుడు తలనొప్పి వస్తుంది.? ఎంతసేపు ఉంటుంది అనేది డైరీలో రాయండి. ఇలా చేయడం వల్ల డాక్టర్ దగ్గరి నుంచి మంచి ట్రీట్‌మెంట్ పొందడం తోపాటు.. మీ పరిస్థితి చెప్పుకోవడం సులభం అవుతుంది.
ధ్యానం, యోగా చేస్తే మీరు ఉదయం తలనొప్పి నుంచి బయటపడవచ్చు. రోజూ యోగా, ధ్యానం చేయడం వల్ల మనసు ఏకాగ్రతతో ఉంటుంది. ఇంకా శరీరం కూడా చురుకుగా ఉంటుంది.
ఈ మార్పులు చేయడం వల్ల తలనొప్పి సమస్యను జయించవచ్చు. చెప్పడానికి చిన్నదే అయినా.. ఆ బాధ భరించేవారికి తెలుస్తుంది. పైకి కనపడదు.. కానీ నరాలు లాగేసి, కణతలు సుత్తితో బాధినట్లు, కళ్లు జిమ్ అని లాగుతూ.. సడన్‌గా తల వెనుక ఎవరో కొట్టినట్లు అయిపోయి అమ్మో తలనొప్పి మాములగా ఏడిపించదు. చిన్న సౌండ్ అయితే చాలు.. ఎక్కడ బ్రెయిన్ బద్దలైపోతుందా అనిపిస్తుంది కదూ..!
Attachments area