గణేష్ నవరాత్రి 2వ రోజున పూజ మరియు నైవేద్యం

-

ఈశ్వరుని కోపానికి గురైన మన్మథుడు మూడవ కంటి అగ్నికి ఆహుతి అయ్యాడు. అలా కాముని భస్మం చేయగా మిగిలిన రుద్రనేత్రాగ్ని సముద్రంలో పడింది. ఆ అగ్ని నుండి జన్మించిన వాడే జలంధరుడు. శివుని వలన తప్ప వేరొకరి వల్ల  వాడికి మరణం లేదని బ్రహ్మదేవుడు చెప్పాడు. కాలనేమి తన పుత్రిక అయిన బృందను  జలంధరునకు ఇచ్చి వివాహం చేశాడు. ఆమె
పాతివ్రత్యం భంగపడనంతవరకూ జలంధరునకు  చావులేదు. బృంద అనగా లక్ష్మీస్వరూపిణి అయిన తులసియ. శావకారణాన ఇలా పుట్టినందువల్ల  ఆమెలోని లక్ష్మీ అంశను స్వీకరింప దగిన విష్ణువు జలంధరుని రూపంలో బృందతో కలిసిన సందర్భంలో పుట్టినవాడే కామాసురుడు.

lord-ganesh

వాడు రాక్షన గురువైన శుక్రాచార్యుని వద్ద పంచాక్షరీ మంత్రోపదేశం పొందాడు. ఘోరమైన తపస్సు చేసి మహాబలము, నిర్భయత్వం, మృత్యుంజయత్వం, అజేయత్వం, శివభక్తి వరాలుగా పొందాడు. రాక్షసరాజై లోకాన్ని చెరబట్టాడు. లోకమంతా కామాధీనమైంది. ధర్మం నశించింది. కోరికలే ప్రధానమై వావి వరసలు, వయో ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు అన్నీ భంగపడ్డాయి. దీనికితోడు గణపతితో విభేదించిన మూషికాసురుడు రాముడికి తోడయ్యాడు. కామ రాక్షసుని ప్రమాదం గ్రహించిన దేవతలు, మునులు ముద్గల మహర్షి సూచన మేరకు వికట వినాయకుని భక్తి శ్రద్ధలతో సేవించారు.

మూషికాసురుడు రెచ్చగొట్టి నెమలి రూపం ధరించిన కామాసురుడు పురివిప్పి లోకాన్నంతటినీ కామంతో ప్రభావితం చేయటం మొదలు పెట్టాడు.  గణపతి కూడా లొంగిపోతాడని భావించాడు. కానీ.. అది గ్రహించిన గణపతి…  ఓరీ… జీవసృష్టి వృద్ధి కోసం కామం అవసరమే కానీ అది మితిమీరరాదు. నీరూపంలో అది మితిమీరింది. దానిని అణచటానికి నేను వికటరూపంలో
వచ్చానంటూ ఆ నెమలిని అణిచి దానిపై అధిరోహించి లొంగదీసుకున్నాడు. నాటి నుంచి వికృత కామానికి దూరమై వికట వినాయకుని సేవిస్తూ జన్మచరితార్ధం చేసుకుంది మానవాలి. కామం ధర్మబద్ధమైంది.

అటుకులు వడ్లను నానబెట్టి, ఉడకబెట్టుట ద్వారా ఉత్పాదక శక్తిని కోల్పోతాయి. వాటిని దంచి, చెరగటం వల్ల పూర్తిగా బీజ శక్తి కోల్పోయి కామ ప్రకోపమునకు దూరం అవుతాయి. అందుకే నేటి నివేదన అటుకులు. ఈ రోజు  పూజవలన విద్యాగణపతి
అనుగ్రహంతో విద్యారు&థలకు చక్కని విద్యాబుదుడిధలు అలవడుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news