తెలంగాణలో టిడిపి-బిజెపి పార్టీల మధ్య పొత్తు ఉండదు – లక్ష్మణ్

-

తెలంగాణలో టిడిపి-బిజెపి పార్టీ ల మధ్య పొత్తు అనేది ప్రచారం మాత్రమేనని.. టిడిపితో కలిసే ఆలోచనే లేదన్నారు బిజెపి పార్లమెంటరీ బోర్డు మెంబర్ లక్ష్మణ్. తెలంగాణ లో ఒంటరిగా పోటీ చేస్తాం.. ఏపీ లో పవన్ కళ్యాణ్ తో కలిసి ముందుకు వెళ్తామని ప్రకటించారు. కాంగ్రెస్ లక్షణాలు ఉన్న పార్టీ లు అన్ని కలుస్తున్నాయి.. అవినీతి కుటుంబ పాలన నుండి విముక్తి కావాలని తెలంగాణ భావిస్తుందన్నారు.

ఇక్కడ మరణించిన వారి గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని కెసిఆర్ ను నిలదీశారు. తెలంగాణ లో చెల్లని రూపాయి బీహార్ లో చెల్లుతుందా ? కెసిఆర్ మిలటరీ ని అవహేళన చేశారు… క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బిజెపి పార్లమెంటరీ బోర్డు మెంబర్ లక్ష్మణ్.

నితీష్ కుమార్ అమాయకుడు.. నీ ఉచ్చులో పడ్డట్టు ఉన్నాడు, బాయిలో కప్ప లాగ ప్రగతి భవన్, ఫార్మ్ హౌస్ కు పరిమితం అయిన కెసిఆర్ అదే ప్రపంచం అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అత్యంత ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానం లో ఉంది.. పక్క రాష్ట్రాల నుండి కూరగాయలు కొనొక్కోవల్సిన పరిస్థితి… ఇదేనా నీ నూతన వ్యవసాయ విధానమని తెలిపారు బిజెపి పార్లమెంటరీ బోర్డు మెంబర్ లక్ష్మణ్.

Read more RELATED
Recommended to you

Latest news