పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారో .. అటు వైవాహిక జీవితంలో, ఇటు రాజకీయ రంగంలో ఆ గుర్తింపును సొంతం చేసుకోలేకపోయారు. మెగాస్టార్ చిరంజీవిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక పేరుని, అభిమానాన్ని సంపాదించుకున్నారు. అంతే కాదు ఈ కాలం యువతకు ఐకాన్ స్టార్ గా మారిన పవర్ స్టార్ గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం.1971 సెప్టెంబర్ 2వ తేదీన కొణిదెల వెంకటరావు, అంజనాదేవికి చివరి కుమారుడిగా జన్మించిన పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు.. కానీ అంజనాదేవి హనుమంతుడి మీద ఉన్న భక్తితో పవన్ కళ్యాణ్ అని స్క్రీన్ నేమ్ పెట్టించింది.
పవన్ కళ్యాణ్ కు చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే కరాటే నేర్చుకుని బ్లాక్ బెల్ట్ కూడా సాధించాడు.
హీరోగా ఇండస్ట్రీ లోకి ఇష్టం లేకపోయినా తన వదిన సురేఖ ప్రోత్సాహంతో 1996 అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా వెండితెరకు పరిచయమై, ఆ తర్వాత తొలిప్రేమ, తమ్ముడు, బద్రి , ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్ , అత్తారింటికి దారేది లాంటి సినిమాలతో రికార్డులు తిరగ రాశారు.రీల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో కూడా.. జానీ సినిమా కు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు అమౌంట్ కూడా ఇచ్చాడు. ఇక కొమరం పులి సినిమా విషయంలో కూడా తన రెమ్యూనరేషన్ నుంచి రెండు కోట్ల రూపాయలను నిర్మాతకు తిరిగి ఇచ్చి రియల్ హీరో అనిపించుకున్నాడు. అంతేకాదు వైజాగ్ హుధ్ హుద్ బాధితులకు రూ.50 లక్షలు, చెన్నై వరద బాధితులకు రెండు కోట్ల రూపాయల సహాయాన్ని కూడా అందించారు.ప్రముఖ పానీయాల సంస్థ పెప్సీ బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కళ్యాణ్ కొంతకాలం పనిచేసి సౌత్ ఇండియాలోనే కంపెనీ ప్రకటనలకు అత్యధిక పారితోషకం తీసుకున్న యాక్టర్ గా పవర్ స్టార్ నిలిచారు.