లవ్​ ఫెయిల్యూర్​ అంటూ ఎమోషనల్​ అయిన​ రోహిణి.. అసలేమైంది?

-

అటు మాటలతో, ఇటు హావభావాలతో నవ్వించే బుల్లితెర లేడీ కమెడియన్​ రోహిణి. వినోదాన్ని పంచుతూ, కడుపుబ్బా నవ్విస్తున్న ఈ జబర్దస్త్ అమ్మడును రౌడీ రోహిణి అని కూడా అంటారు. బుల్లితెరపై నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె.. కామెడీ పంచులతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

ఇక ఓవైపు కామెడీ షోస్ చేస్తూనే మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్​తో ఆకట్టుకుంటున్న జబర్దస్త్​ రోహిణి.. ఎక్కడుంటే అక్కడ ఫన్ క్రియేట్ చేస్తుంటుంది. అలా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్​ను సంపాదించుకుంది. అయితే.. తాజాగా ఆమె.. అందరి లైఫ్​లో లవ్ స్టోరీస్ ఉన్నట్లే తన లైఫ్​లో కూడా ఉందని చెప్పుకొచ్చింది. అయితే ఆ ప్రేమ తనకు విషాదాన్ని మిగిల్చిందని ఎమోషనల్​ అయింది.

తెలుగు బుల్లితెరపై జీ తెలుసు ‘మన ఊరి రంగస్థలం’ అనే ఓ సరికొత్త ప్రోగ్రామ్​ను ప్రారంభించబోతుంది. తాజాగా దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. మొదటి ఎపిసోడ్ కాబట్టి.. అన్ని హంగులతో, సింగర్స్, యాక్టర్స్, స్పెషల్ పెర్ఫార్మన్స్​లతో అదరగొట్టబోతున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీముఖి హోస్ట్​గా వ్యవహరిస్తోంది.

ఈ ప్రోమోలో భాగంగానే సింగర్స్ ఓ బ్రేకప్ సాంగ్ పాడటంతో.. శ్రీముఖి ఒక్కొక్కరిని వాళ్ల లైఫ్​లో లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా అని అడిగింది. అప్పుడు రోహిణి మొదటిసారి తన లవ్ స్టోరీ గురించి ఓపెన్ అయింది. “తాను సిన్సియర్ గా ఓ వ్యక్తిని లవ్ చేశానని, ఒక 8 నెలలు ట్రావెల్ అయ్యాక అతనికి ఆల్రెడీ ఒక లవర్ ఉందని తెలిసిం” అని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం రోహిణి మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె లవ్ స్టోరీ ఏంటనేది ఆ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్​ చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news