వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్‌లో అడుగుపెట్టిన భార‌త్‌.. బంగ్లాదేశ్‌పై గెలుపు..!

-

ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 టోర్నీలో ఓట‌మి అంటూ ఎరుగ‌ని జ‌ట్టుగా ఉన్న టీమిండియా ఇంగ్లండ్ చేతిలో ప‌రాజ‌యం పాలై కొంత ఆందోళ‌న‌లో ఉండ‌గా..ఇవాళ్టి విజ‌యం భార‌త్‌లో మ‌ళ్లీ ఆత్మ విశ్వాసాన్ని నింపింది.

ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 టోర్నీలో ఓట‌మి అంటూ ఎరుగ‌ని జ‌ట్టుగా ఉన్న టీమిండియా ఇంగ్లండ్ చేతిలో ప‌రాజ‌యం పాలై కొంత ఆందోళ‌న‌లో ఉండ‌గా..ఇవాళ్టి విజ‌యం భార‌త్‌లో మ‌ళ్లీ ఆత్మ విశ్వాసాన్ని నింపింది. బ‌ర్మింగ్‌హామ్‌లో ఇవాళ జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ బంగ్లాదేశ్‌పై 28 ప‌రుగుల తేడాతో గెలుపొంది వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ క్ర‌మంలో బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో ఓట‌మితో వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి నిష్క్ర‌మించింది.

మ్యాచ్‌లో భార‌త్ ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 314 ప‌రుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ (92 బంతుల్లో 104 పరుగులు, 7 ఫోర్లు, 5 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (92 బంతుల్లో 77 పరుగులు, 6 ఫోర్లు, 1 సిక్సర్), రిషబ్ పంత్ (41 బంతుల్లో 48 పరుగులు, 6 ఫోర్లు, 1 సిక్సర్)లు అద్భుత‌మైన ప్ర‌దర్శ‌న చేశారు. ఇక బంగ్లాదేశ్‌ బౌలర్లలో ముస్తాఫిజుర్ రహమాన్‌కు 5 వికెట్లు ద‌క్క‌గా, షకీబ్ అల్ హసన్, రూబెల్ హుస్సేన్, సౌమ్యా సర్కార్‌ల‌కు తలా 1 వికెట్ ద‌క్కింది.

అనంత‌రం భార‌త్ నిర్దేశించిన‌ 315 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 48 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే బంగ్లా జ‌ట్టు ఆరంభంలో చ‌క్క‌గానే ఆడిన‌ప్పటికీ ఆ జ‌ట్టు కీల‌క స‌మ‌యాల్లో ముఖ్య‌మైన వికెట్ల‌ను కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. దీంతో ఆ జ‌ట్టుకు ఓట‌మి త‌ప్ప‌లేదు. కాగా బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ల‌లో షకీబ్ అల్ హసన్ (74 బంతుల్లో 66 పరుగులు, 6 ఫోర్లు), మహమ్మద్ సైఫుద్దీన్ (38 బంతుల్లో 51 పరుగులు, 9 ఫోర్లు)లు రాణించారు. ఇక భార‌త బౌల‌ర్ల‌లో జస్‌ప్రిత్ బుమ్రాకు 4 వికెట్లు దక్క‌గా, హార్దిక్ పాండ్యాకు 3, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, యజువేంద్ర చాహల్‌ల‌కు తలా 1 వికెట్ ద‌క్కింది.

Read more RELATED
Recommended to you

Latest news