సూపర్ దాదీ.. క్రికెట్ మ్యాచ్ లో భారత్ కు 87 ఏళ్ల బామ్మ చీర్స్.. వైరల్ వీడియోలు

-

ఈ బామ్మ ఇండియా ఇండియా అంటూ అరుస్తూ.. విజిల్ వేస్తూ.. డ్యాన్స్ చేస్తూ.. ఇండియాకు చీర్స్ చేసింది. ఆ హుషారుతోనే ఇండియా గెలిచింది కాబోలు అన్నట్టుగా ఉన్నాయి ఆమె డ్యాన్సులు.

ఆమె పేరు చారులత పటేల్. వయసు 87. కానీ.. నిన్న మాత్రం తన వయసును ఆమె పక్కన పెట్టేసింది. 20 ఏళ్ల యువతిలా మారిపోయింది. తెగ ఎంజాయ్ చేసింది. యువకులతో కలిసి డ్యాన్స్ చేసింది. హుషారెత్తించింది. ఎడ్జ్ బాస్టన్ లో నిన్న భారత్, బంగ్లా మధ్య జరిగిన మ్యాచ్ లోనే ఈ బామ్మ తెగ హంగామా చేసింది. అంతే కాదు.. ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్ అయింది. ఐసీసీ, బీసీసీఐ, క్రికెట్ వరల్డ్ కప్ ట్విట్టర్ అకౌంట్ లో నిన్న మొత్తం బామ్మకు సంబంధించిన ట్వీట్లే. నెటిజన్లు కూడా బామ్మ హుషారును చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఈ బామ్మ ఇండియా ఇండియా అంటూ అరుస్తూ.. విజిల్ వేస్తూ.. డ్యాన్స్ చేస్తూ.. ఇండియాకు చీర్స్ చేసింది. ఆ హుషారుతోనే ఇండియా గెలిచింది కాబోలు అన్నట్టుగా ఉన్నాయి ఆమె డ్యాన్సులు.

ఇండియాకు ఇంతలా చీర్స్ కొట్టిన ఈ బామ్మది మాత్రం ఇండియా కాదు. బామ్మది టాంజానియా. కాకపోతే తన పూర్వీకులది ఇండియా. అందుకే.. తనకు ఇండియా అంటే చాలా ఇష్టమట.

మ్యాచ్ ఆడుతున్న సమయంలో బామ్మ ఇండియాకు చీర్స్ కొట్టడం గమనించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మ్యాచ్ గెలిచిన అనంతరం ఆమెను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. మీరు మాకు లక్కీ.. మీరు ఇక్కడికి వచ్చి చీర్స్ కొట్టడం వల్లే మేం గెలిచాం.. అంటూ ఆమెను పొగిడి.. ఆమె నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు.

తర్వాత మీడియాతో మాట్లాడిన బామ్మ… తన పిల్లలు కూడా క్రికెట్ ఆడేవారని తెలిపారు. ఇప్పుడు టీమిండియాను చూస్తుంటే నా పిల్లలే క్రికెట్ ఆడుతున్నట్టుగా అనిపిస్తోంది. నాది ఇండియా కాకున్నా… నాకు టీమిండియా అంటే చాలా ఇష్టం. నా పూర్వీకులది ఇండియానే. ఈసారి వరల్డ్ కప్ ను టీమిండియానే గెలుస్తుంది.. అంటూ చెప్పుకొచ్చింది బామ్మ.

Read more RELATED
Recommended to you

Latest news