ఢిల్లీ లిక్కర్ స్కాంపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్రంలో అధికారంలో ఉండి ఢిల్లీకి వెళ్లి స్కాంలో వాటా అడుక్కుంటారా?? ఏపీతో పోల్చుకుంటే ఢిల్లీ ఎంత?? అని ఫైర్ అయ్యారు. ఇక్కడ ఉండే సేల్స్ ఎంత?? అక్కడ ఉండే సేల్స్ ఎంత?? అని నిలదీశారు. ఆ ఖర్మ చంద్రబాబుదని… వెళ్ళి కేసీఆర్ నో, స్టాలిన్‌నో చంద్రబాబు అడుక్కుంటాడని విమర్శలు చేశారు.
రెండు వైన్ షాపులు ఇవ్వండి హెరిటేజ్‌లో మజ్జిగ అమ్మినట్లు అమ్ముకుంటాం అని చెప్పుకుంటాడు… జగన్ నిలువెత్తు నిప్పులాంటి వాడని కొనియాడారు. భారతమ్మ ఢిల్లీ వెళ్ళి నాలుగు వైన్ షాపులకు లైసెన్సులను అడిగే ఖర్మ ఉందా?? అని ఆగ్రహించారు.
లక్ష కోట్ల ఆరోపణలు చేసి కాంగ్రెస్‌తో కలిసి జగన్‌ను 16 నెలలు జైల్లో పెట్టి ఏం సాధించారు?? ముఖ్యమంత్రి కాకుండా అడ్డు కోగలిగారా?? ప్రజలు అమాయకులా??వాళ్ళకు వాస్తవాలు తెలియవా? ఎవడు ఈ లోకేష్?? అని మండిపడ్డారు. తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి ..వీడేమో కార్పొరేటర్‌గా కూడా గెలవలేని శుంఠ అని… ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మా దగ్గర పేపర్లు, పెన్నులు లేవా?? లిస్ట్‌లు రాయలేమా? వాడు కుప్పంలో గెలవడు, కొడుకు మంగళగిరిలో గెలవడని తేల్చి చెప్పారు కొడాలి నాని.