నవోదయ విద్యాలయాల్లో 2370 ఉద్యోగాలు

-

  • డిగ్రీ, పీజీ, బీఈడీ, బీఈ/బీటెక్,నర్సింగ్, లైబ్రేరీడిగ్రీ చేసినవారికి అవకాశం
  •  సీబీటీ/రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
  •  ఆకర్షణీయమైన జీతభత్యాలు, వసతి సౌకర్యాలు.

దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ పాఠశాలల్లో పీజీటీ, టీజీటీ, లీగల్ అసిస్టెంట్, స్టాఫ్ నర్స్ తదితర పోస్టుల భర్తీకి నవోదయ విద్యాలయ సమితిలో ప్రకటన విడుదల చేసింది.

2370 jobs vacancy In Navodaya Vidyalaya Samiti

పోస్టులు- ఖాళీలు: అసిస్టెంట్ కమిషనర్ (గ్రూప్-ఏ)
ఖాళీలు: 5
అర్హతలు: పీజీలో హ్యుమానిటీస్/సైన్స్ లేదా కామర్స్‌లో ఉత్తీర్ణతతోపాటు లెవల్-10 పేస్కేల్ పోస్టులో కనీసం ఐదేండ్లు ప్రభుత్వ లేదా సెమీగవర్నమెంట్ లేదా అటానమస్ ఆర్గనైజేషన్‌లో పనిచేసి ఉండాలి.
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (గ్రూప్-బీ)
ఖాళీలు: 439
అర్హతలు: 40 ఏండ్లు మించరాదు. కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత. బీఈడీ, ఇంగ్లిష్, హిందీల మీడియంలలో బోధించగలిగే ప్రావీణ్యం ఉండాలి. పీజీటీ కంప్యూటర్ సైన్స్ పోస్టులకు టీజీటీగా పనిచేసిన అనుభవం, కంప్యూటర్ అప్లికేషన్ నాలెడ్జ్‌తోపాటు కనీసం 50 శాతం మార్కులతో కింది వాటిలో ఏదైనా ఒక అర్హత ఉండాలి.
బీఈ/బీటెక్ (కంప్యూటర్‌సైన్స్/ఐటీ) లేదా బీఈ/బీటెక్ ఏ స్ట్రీమ్‌లోనైనా ఉత్తీర్ణతతోపాటు పీజీడీసీఏ లేదా ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్/ఎంసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్‌తోపాటు పీజీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.

ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్

ఖాళీలు: 1154
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతోపాటు బీఈడీ, సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి. హిందీ, ఇంగ్లిష్ /స్థానిక భాషలో బోధించగలిగే సామర్థ్యం ఉండాలి.
మ్యూజిక్-111, ఆర్ట్-130, పీఈటీ మేల్-148, పీఈటీ ఫిమేల్-105, లైబ్రేరియన్-70, స్టాఫ్ నర్స్-55, లీగల్ అసిస్టెంట్-1 ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: పై పోస్టుల అర్హతలు వేర్వేరుగా ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ/పర్సనల్ ఇంటరాక్షన్ ద్వారా చేస్తారు.

పరీక్ష కేంద్రం: రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉంది.

పీజీటీ పోస్టులకు: రీజినింగ్ ఎబిలిటీ-15, జనరల్ అవేర్‌నెస్-15, టీచింగ్ ఆప్టిట్యూడ్-20, సంబంధిత సబ్జెక్టు-100 మార్కులతోపాటు లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్‌లో ఇంగ్లిష్, హిందీపై 30 ప్రశ్నలు ఇస్తారు. ఈ లాంగ్వేజ్ టెస్ట్ కేవలం క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే. దీనిలో క్వాలిఫై అయితేనే మిగిలిన విభాగాలను పరిగణనలోకి తీసుకుంటారు. పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు.
టీజీటీ పరీక్ష విధానం: రీజినింగ్ ఎబిలిటీ-10, జనరల్ అవేర్‌నెస్-10, టీచింగ్ ఆప్టిట్యూడ్-15, సంబంధిత సబ్జెక్టు-100, లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ -45 మార్కులు. పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు.
మిగిలిన పోస్టులకు ఎంపిక విధానానికి నిర్వహించే పరీక్ష విధానాన్ని వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జూలై 10 నుంచి ప్రారంభం.

చివరితేదీ: ఆగస్టు 9

ఫీజు చెల్లించడానికి చివరితేదీ: ఆగస్టు 12

పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 5-10 మధ్య నిర్వహిస్తారు.

వెబ్‌సైట్: Navodaya

Read more RELATED
Recommended to you

Latest news