సినిమాలకు షారుఖ్ ఖాన్ గుడ్ బై..!

-

ఎంత మంచి స్టోరీ లైన్ ఎంచుకొని సినిమాల్లో నటించినా.. షారుఖ్ సినిమాలు ఎందుకో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. చిన్న చిన్న సినిమాలు హిట్ అవుతున్నా.. తన సినిమాలు ఎందుకు ప్లాఫ్ అవుతున్నాయో.. షారుఖ్ కు అర్థం కావడం లేదట.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. అవును… గత కొన్ని సంవత్సరాలుగా షారుఖ్ ఖాన్ ను సరైన హిట్ లేదు. చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా తర్వాత షారుఖ్ కు ఒక్క హిట్ కూడా పడలేదు. తనకన్నా లేటుగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లంతా హిట్లతో దూసుకుపోతుంటే.. తను మాత్రం ప్లాఫ్స్ మూటకట్టుకొని వెనుకబడి పోవడంతో.. బాద్ షా చాలా మనస్తాపం చెందారట.

ఎంత మంచి స్టోరీ లైన్ ఎంచుకొని సినిమాల్లో నటించినా.. షారుఖ్ సినిమాలు ఎందుకో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. చిన్న చిన్న సినిమాలు హిట్ అవుతున్నా.. తన సినిమాలు ఎందుకు ప్లాఫ్ అవుతున్నాయో.. షారుఖ్ కు అర్థం కావడం లేదట. మొన్న వచ్చిన జీరో సినిమాపై షారుఖ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ.. ఆ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో షారుఖ్ ఇక సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నారట.

ఇన్నిరోజులు సినిమాల బిజీలో పడి.. కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేకపోయానని బాధపడుతున్న షారుఖ్.. ఇప్పుడు సినిమాలకు బైబై చెప్పి తన పూర్తి సమయాన్ని ఇక కుటుంబంతో కలిసి గడపాలని నిర్ణయించుకున్నారట.

అయితే.. షారుఖ్ ఏం చెప్పినా.. ఆయన బాధ అంతా తన సినిమాలు ఆడటం లేదనేనని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే.. షారుఖ్ సినిమాలకు గుడ్ బై చెప్పినా.. తన వారసులు.. త్వరలోనే సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నారట. అందుకే.. వాళ్లను మంచి నటులుగా తీర్చిదిద్దడంలో షారుఖ్ బిజీ అయ్యారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news