ఉచిత IAS కోచింగ్ కార్యక్రమం ప్రారంభించిన సోనూసూద్

-

సినిమాలలో విలన్ వేషాలు వేస్తూ.. నిజజీవితంలో ఎందరికో సాయం చేస్తూ రియల్ హీరోగా నిలిచారు నటుడు సోనూసూద్. కరోనా కష్టకాలంలో ఎందరో అభాగ్యులకు అండగా నిలిచారు. సాయం అని అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ.. ఆపద్బాంధవుడిలా ఆదుకున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడిన లక్షలాదిమందిని సొంత ఊర్లకు చేర్చారు.

ప్రాంతం, భాష, కులం, మతం ఎలాంటి భేదాలు లేకుండా దేశం నలుమూలల నుంచి ఎవరు సాయం కోరినా చేసే సోనూసూద్.. తాజాగా మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఐఏఎస్ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవారికి ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తున్నారు. 2022 – 23 ఏడాదికి గాను ఎంపికైన పేద అభ్యర్థులకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ ఇప్పించనున్నట్లు ప్రకటించారు.

డివైన్ ఇండియా యూత్ అసోసియేషన్ తో కలిసి ఉచిత ఐఏఎస్ కోచింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంభవం పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా ఐఏఎస్ కు సిద్ధమవుతున్న అన్ని వర్గాలకు చెందిన అభ్యర్థులకు సమాన అవకాశాలు వస్తాయని సోనూ ఆశాభావం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news