విరాట్ కోహ్లీతో తమకు తిప్పలు తప్పవని.. కోహ్లో తమ టీమ్‌కు పెద్ద సవాల్ అని ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నారు. ఆసియా కప్‌లో అదరగొట్టిన విరాట్ ప్రదర్శనపై తాజాగా ఈ క్రికెటర్ స్పందించాడు. విరాట్ ఫామ్‌లోకి వస్తాడనడంలో తమకు ఎలాంటి డౌట్ లేదని కమిన్స్ అన్నాడు. టీ20లకు ఫుల్‌గా రెడీ అయిన విరాట్.. ఈనెల 20న జరిగే మ్యాచ్‌లో తమను ఢీకొట్టడాని సిద్ధంగా ఉన్నాడని.. ఈ మ్యాచ్‌లలో తమకు సవాల్ విసురుతాడని అభిప్రాయపడ్డాడు. టీమ్‌ఇండియాతో సిరీస్ ప్రారంభం నేపథ్యంలో ప్యాట్ కమిన్స్ ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో మాట్లాడాడు.
“ఆసియా కప్‌ను పెద్దగా గమనించలేదు. లంక గెలిచినట్లు ఉంది. విరాట్ ఆటను చూశా. సెంచరీ కొట్టాడు. కోహ్లీ క్లాస్ ప్లేయర్. అతడు ఎప్పుడైనా ఫామ్‌లోకి వస్తాడని తెలుసు. వచ్చేవారం జరిగే మ్యాచుల్లో మాకు విరాట్ సవాల్‌గా మారే అవకాశం ఉంది. అదేవిధంగా భారత్‌లో ఆడేటప్పుడు పేసర్లు త్వరగా పరిస్థితులను అలవర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడి పిచ్‌లు పేస్‌ను విభిన్నంగా సంధించాల్సి ఉంటుంది. బౌండరీలు కాస్త చిన్నవిగా ఉంటాయి. వికెట్ కూడా స్లోగా ఉంటుంది” అని ప్యాట్ కమిన్స్ తెలిపాడు.