ఆర్మీ ఆఫీస‌ర్ గా మ‌హేష్.. సరిలేరు నీకెవ్వరూ మూవీ ఫోటో లీక్

-

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో స‌రిలేరు నీకెవ్వ‌రు తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం జ‌మ్ముక‌శ్మీలోమ‌హేష్ ఇత‌ర తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఇందులో మ‌హేష్ ఆర్మీ అధికారి పాత్ర‌లో క‌నిపించ‌న‌న్నాడు. తాజాగా షూటింగ్ స్పాట్ నుంచి మ‌హేష్ పిక్ ఒక‌టి లీక్ అయింది. అందులో సూప‌ర్ స్టార్ ఆర్మీ యూనిఫాంలో అదిరిపోయాడు. మిల‌ట‌రీ దుస్తులు ధ‌రించిన మ‌హేష్ త‌న బెటాలియ‌న్ లోని ఇత‌ర కొలిగ్స్ తో సీరియ‌స్ గా చ‌ర్చిస్తున్న‌ట్లు అక్క‌డ స‌న్నివేశాన్ని బ‌ట్టి తెలుస్తోంది. న‌డుం పై చేయిపెట్టుకుని కాస్త స్టైలిష్ గాను నుంచున్నాడు. మ‌హేష్ వేసిన దుస్తుల‌పై బ్యాడ్జీల‌ను బ‌ట్టి అత‌ని పాత్ర మిల‌టీరీలో ఓ పెద్ద ఆఫీస‌ర్ రోల్ అనే తెలుస్తోంది.

ఈ పిక్ ర‌ఫ్ క‌ట్ లా అనిపిస్తోంది. ఇది ఇప్పుడు సోష‌ల్ మీడియా అంత‌టా దావానాలా వ్యాపిస్తోంది. దీంతో మ‌హేష్ అభిమానుల ఆనందానికి వ‌ధుల్లేవ్. సూప‌ర్ స్టార్ ఫ‌స్ట్ లుక్ లోనే అద‌ర‌గొట్టాడంటూ కామెంట్లు వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా త‌మ ఐడియాల‌ను షేర్ చేసుకుంటున్నారు. ఈ క‌థ‌ను గ‌నుక అనీల్ కామెడీగా కాకుండా సీరియ‌స్ గా సాగే ఆర్మీ స్టోరీలా తీస్తే అదిరిపోతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ మ‌హేష్ ఆర్మీ రోల్ చేయ‌లేదు కాబ‌ట్టి…ఇలాంటి క‌థ‌లు సీరియ‌స్ గా సాగితేనే కిక్కు ఉంటుంద‌ని అభిప్రాయ ప‌డుతున్నారు. మ‌హేష్ అభిమానులు చెప్పింది క‌రెక్ట్. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఇటీవ‌లే బ‌న్నీ నా పేరు సూర్య సినిమా తీసాడు.

మంచి థీమ్ తో క‌థ ప్రారంభ‌మైనా వ‌క్కంతం వంశీ క‌మ‌ర్శిలైజ్ కోసం చేసిన ప్ర‌య‌త్నం బెడిసి కొట్టింది. క్లైమాక్స్ ను అతిగా సాగ‌దీయ‌డం..ఆ క‌థ‌లో శ‌ర‌త్ కుమార్ రోల్ అన్నీ తేడా కొట్టేసాయి. బ‌న్నీ-అర్జున్ మ‌ధ్య టెంపోనే చివ‌రి వ‌ర‌క కొన‌సాగించి ఉంటే ఆ సినిమా నెక్స్ట్ లెవ‌ల్లో ఉండేద‌ని క్రిటిక్స్ సైతం అభిప్రాయ‌ప‌డ్డారు. కానీ క‌మ‌ర్శియాల్టీ కొంప ముంచింది. మ‌రి అనీల్ మ‌హేష్ ను ఎలా చూపిస్తాడో? తెలియాలంటే రిలీజ్ వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న న‌టిస్తోంది. సీనియ‌ర్ న‌టి విజ‌య‌శాంతి ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news