డేటింగ్ విషయంలో కుమార్తెకు గౌరీ ఖాన్ సలహా.. ఏంటంటే?

-

ఇంటీరియర్‌ డిజైనర్‌గా గుర్తింపు తెచ్చుకొని కెరీర్‌లో రాణిస్తున్నారు బాలీవుడ్‌ స్టార్‌హీరో షారుఖ్‌ ఖాన్‌ సతీమణి గౌరీ ఖాన్‌. ఈక్రమంలోనే తాజాగా ఆమె ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో సందడి చేశారు.

కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తన స్నేహితులు భావన పాండే, మహీప్‌ కపూర్‌లతో కలిసి ఆమె పాల్గొన్నారు. కరణ్‌ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలిచ్చారు.

‘‘డేటింగ్‌ విషయంలో మీ కుమార్తె సుహానా ఖాన్‌కు మీరిచ్చే సలహా ఏమిటి?’’ అని కరణ్‌ ప్రశ్నించగా.. ‘‘ఒకే సమయంలో ఇద్దరు అబ్బాయిలతో డేట్‌ చేయొద్దని చెబుతా’’ అని గౌరీ బదులిచ్చారు. అనంతరం షారుఖ్‌తో తన ప్రేమకథకు ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ టైటిల్‌ పెడతానని ఆమె చెప్పుకొచ్చారు. తమ ప్రేమకథలో గొడవలున్నాయని ఆమె తెలిపారు.

అనంతరం, ‘‘ఒకవేళ మీకు ఏదైనా సినిమాలో నటించే అవకాశం వస్తే హీరోగా మీ సరసన ఎవరు నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు?’’ అని మహీప్‌కపూర్‌ని కరణ్‌ ప్రశ్నించాడు. ‘‘హృతిక్‌రోషన్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలని ఉంది. మా ఇద్దరి జోడీ చూడముచ్చటగా ఉంటుందని నమ్ముతున్నా’’ అని మహీప్‌ తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రోమో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news