కాంగ్రెస్ లో గెలిచి…టీఆర్ఎస్ లో చేరి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండల కేంద్రం లో వైఎస్ షర్మిల గారికి ఘన స్వాగతం పలికారు గ్రామస్థులు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ ఒక మత పిచ్చి పార్టీ అని… మతం పేరు చెప్పి చలి కాచుకుంటుందని ఫైర్ అయ్యారు.
రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి బీజేపీ మోసం చేసిందని.. విభజన సమస్యలు సైతం బీజేపీ నెరవేర్చలేదని వివరించారు. తెలంగాణ లో వైఎస్సార్ పాలన కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అన్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలన మళ్ళీ తెస్తానని.. వైఎస్సార్ ప్రతి పథకం రాజన్న బిడ్డ ఈ షర్మిల నిలబెడుతుందని వెల్లడించారు. తెచ్చిన అప్పులు మొత్తం కేసీఅర్ ఇంట్లోకి వెళ్ళాయి… ప్రాజెక్ట్ ల పేరు చెప్పి కమీషన్ల రూపంలో తినేశారన్నారు. మెగా కృష్ణా రెడ్డి కి దోచి పెట్టారని… మెగా కృష్ణా రెడ్డికి బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు అమ్ముడు పోయాయని ఆగ్రహించారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే ..అది టీఆర్ఎస్ కు వేసినట్లేనని ఆరోపించారు.