రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బలమైన కూటమి అవసరం : సీపీఐ నారాయణ

-

టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌ దసరా నాటికి కొత్తగా పెడుతున్న జాతీయ పార్టీ బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కే నారాయణ సూచించారు. మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ, కార్పొరేట్‌ శక్తులకు దేశ సంపదను దోచిపెట్టడం, ఫెడరల్‌ వ్యవస్థను, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బలమైన కూటమి అవసరమన్నారు సీపీఐ నారాయణ. ఈ తరుణంలో బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక మంది ముఖ్యమంత్రులు, కాంగ్రెస్‌తో సహా అన్ని జాతీయ పార్టీలు ముందుకు వస్తున్నాయన్న సీపీఐ నారాయణ.. ఇందుకు కేసీఆర్‌ కూడా ముందుకు రావడం సమర్థనీయమన్నారు.

CPI national secretary Dr K Narayana says Judiciary deserves due respect

కేసీఆర్‌ ప్రకటించబోయే జాతీయ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పోటీ పడాల్సి ఉందని, బీజేపీ వ్యతిరేక కూటమి బలపడే విధంగా టీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీ అడుగులు వేస్తే మంచిదన్నారు సీపీఐ నారాయణ. కేసీఆర్‌ కొత్తగా పెడుతున్న జాతీయ పార్టీని సీపీఐ స్వాగతిస్తుందన్నారు నారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news