పెన్షన్ ని పొందాలంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రతీ ఏడాది నవంబర్ లో జీవిత ధ్రువీకరణ పత్రం లేదా లైఫ్ సర్టిఫికెట్ లేదా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ని సబ్మిట్ చెయ్యాల్సి వుంది. లేదంటే పెన్షన్ అందదు. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS), 1995 లో భాగమైన పెన్షనర్లు ఎవరైనా సరే సబ్మిట్ చెయ్యాలి.
దీనిని సబ్మిట్ చెయ్యడానికి నేరుగా వెళ్ళాలి. నవంబర్ లో ఒకసారి అంటే తక్కువ సమయమే వుండచ్చని అక్టోబర్ 1 నుంచే లైఫ్ సర్టిఫికేట్ ని సబ్మిట్ చెయ్యచ్చని చెప్పారు. 80 ఏళ్లు పైబడిన పెన్షనర్లు అక్టోబర్ 1 నుంచే సబ్మిట్ చెయ్యచ్చు. దీనితో చాలా మందికి రిలీఫ్ కలగనుంది.
ఇక ఎలా సబ్మిట్ చెయ్యచ్చనేది చూస్తే.. జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా జీవన్ ప్రమాణ్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి వుంది. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను జనరేట్ చేసుకుని ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
మొబైల్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ని ఇలా సబ్మిట్ చేసేయండి:
దీని కోసం మొదట మీరు ఆధార్ ఫేస్ఆర్‌డీ యాప్‌ను డౌన్లోడ్ చేయండి.
జీవన్ ప్రమాణ్ పోర్టల్ నుండి ఫేస్ యాప్ ని ఎక్కించండి.
అథెంటికేషన్ అయ్యాక పెన్షనర్ గుర్తింపును ధ్రువీకరించాలి.
సాంక్షనింగ్ అథారిటీ, డిస్బర్సింగ్ ఏజెన్సీ ఆధార్, మొబైల్ నెం లాంటి వివరాలను ఇవ్వాలి.
ఫేస్ స్కాన్ చేసేసి సబ్మిట్ చేయాలి. ఫైనల్ గా మీరు లైఫ్ సర్టిఫికెట్ ని సబ్మిట్ చేసినట్టు పెన్షనర్లకు మెసేజ్ వెళ్తుంది అంతే.